దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే ఉపకరణాల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ దివ్యాంగులకు వివిధ రకాలైన 13వేల 195 ఉపకరణాలు ఉచితంగా పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్లు వివరించారు.
దివ్యాంగులు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోండి: కొప్పుల ఈశ్వర్ - Government good news for the disabled
ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే ఉపకరణాల కోసం దివ్యాంగులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ 13వేల 195 ఉపకరణాలు ఉచితంగా పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు వివరించారు.
20కోట్ల 41 లక్షల రూపాయల వ్యయంతో త్రిచక్రవాహనాలు, వీల్ఛైర్స్, లాప్టాప్స్, 4జీ స్మార్ట్ ఫోన్స్, వినికిడి యంత్రాలు చేతికర్రలు, ఎంపీ3 ప్లేయర్స్ పంపిణీ చేయనున్నట్లు కొప్పుల తెలిపారు. 90వేల రూపాయల విలువ చేసే.. 900 రిట్రోఫెట్టెడ్ మోటారు వాహనాలు కూడా ఇస్తున్నట్లు తెలిపారు. ఉపకరణాల కోసం దివ్యాంగులు ఈనెల 25 నుంచి ఫిబ్రవరి 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి వివరించారు.
www.obmms.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న.. అర్హతగల దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా కమిటీ ఎంపిక చేసిన దరఖాస్తుదారులకు ఫిబ్రవరి 15 నుంచి ఉపకరణాల పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు.