తెలంగాణ

telangana

ETV Bharat / state

పెండింగ్​ మ్యుటేషన్లన్నింటినీ తక్షణమే పరిష్కరించాలి: ప్రభుత్వం - పెండింగ్​ మ్యుటేషన్లు తాజా వార్లు

పెండింగ్​లో ఉన్న మ్యుటేషన్లన్నింటినీ తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. పెండింగ్​లో ఉన్న దరఖాస్తులు మూడు రోజుల్లోగా పరిష్కరించాలని స్పష్టం చేసింది.

TS government has directed that all pending mutations be resolved immediately
పెండింగ్​ మ్యుటేషన్లన్నింటినీ తక్షణమే పరిష్కరించాలి: ప్రభుత్వం

By

Published : Sep 24, 2020, 6:37 PM IST

పట్టణ ప్రాంతాల్లోని ఆస్తుల బదలాయింపు ప్రక్రియ కోసం... పెండింగ్​లో ఉన్న మ్యుటేషన్లన్నింటినీ తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నగర, పురపాలికల్లో ఆన్​లైన్​ మ్యుటేషన్​ ధ్రువపత్రాల కోసం.. దరఖాస్తులు పెండింగ్​లో ఉన్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లు.. వాటిని 3 రోజుల్లోగా పరిష్కరించాలని తెలిపింది.

పెండింగ్​లో ఉన్న వారసత్వ బదిలీతో పాటు ఇతర మ్యుటేషన్​లన్నింటినీ పరిష్కరించి నివేదిక పంపాలని మున్సిపల్​ కమిషనర్లను ఆదేశించింది. నిర్ధిష్ట గడువులోగా.. ఆన్​లైన్​లో ప్రక్రియ పూర్తయ్యేలా పర్యవేక్షించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, పురపాలక శాఖ ప్రాంతీయ సంచాలకులను కోరింది. ఈ మేరకు పురపాలక శాఖ సంచాలకులు సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు.

ఇదీచూడండి: రిజిస్ట్రేషన్ల నిలిపివేతపై వివరణ ఇవ్వండి: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details