తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ విషయంలో ప్రభుత్వానికి స్పష్టత ఉంది: హైకోర్టు - TS government news

వరద ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని.. న్యాయవాది ప్రభాకర్​ హైకోర్టును కోరారు. ఈ విషయంలో తమ జోక్యం అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టిందని హైకోర్టు పేర్కొంది.

TS government has clarity on flood relief measures said high court
ఆ విషయంలో ప్రభుత్వానికి స్పష్టత ఉంది: హైకోర్టు

By

Published : Aug 17, 2020, 11:43 AM IST

రాష్ట్రంలో భారీ వర్షాలపై హైకోర్టులో ప్రస్తావన వచ్చింది. సహాయక చర్యలు చేపట్టేలా ఆదేశాలివ్వాలని న్యాయవాది ప్రభాకర్​ కోరారు. వరద సహాయక చర్యల్లో హైకోర్టు జోక్యం అవసరం లేదని ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టిందని హైకోర్టు పేర్కొంది.

హైదరాబాద్​ సహా అన్ని ప్రాంతాలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది కదా అని న్యాయస్థానం ప్రశ్నించింది. వరద ప్రాంతాలకు ప్రభుత్వం హెలికాప్టర్లను కూడా సిద్ధం చేసిందని తెలిపింది. ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఊహించి జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన హైకోర్టు... వరద పరిస్థితులపై ప్రభుత్వానికి స్పష్టత ఉందని చెప్పింది. సుమోటోగా స్పందించాలన్న న్యాయవాది అభ్యర్థనను తోసిపుచ్చింది.

ఇదీ చదవండి: భారత్​ సత్తా: జాబిల్లిపై ఇళ్ల నిర్మాణానికి అంతరిక్ష ఇటుకలు

ABOUT THE AUTHOR

...view details