హైదరాబాద్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. మహానగరానికి ఇంకా భారీ వర్షాల ముప్పు ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమవుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు అవసరమైన బోట్లను సిద్ధం చేస్తున్నారు.
జీహెచ్ఎంసీ అప్రమత్తం... నగరానికి 50 పర్యాటక శాఖ బోట్లు.. - Heavy Rains in Hyderabad
రాజధానిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రిజర్వాయర్ల వద్ద ఉన్న పర్యాటక బోట్లను ప్రభుత్వం తెప్పించింది. సహాయక చర్యల కోసం 50 పడవలను నగరానికి తరలించారు.
జీహెచ్ఎంసీ అప్రమత్తం... నగరానికి 50 పర్యటక బోట్లు..
రాష్ట్రంలో వివిధ రిజర్వాయర్ల వద్ద ఉన్న మర పడవలను హైదరాబాద్‌కు తరలించారు. సుమారు 50 బోట్లను సహాయక చర్యల కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు పర్యాటక శాఖ జీహెచ్ఎంసీకి సమకూర్చింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మరో 5 బోట్లు.. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని పంపించింది.
- ఇదీ చూడండి:హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం