తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ టైమ్ దాటితే రెండేళ్ల జైలు, జరిమానా

29న సాయంత్రం 6 గంటలలోపు జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి ముగింపు పలకాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్​ సూచించింది. సాయంత్రం ఆరు గంటల తర్వాత ప్రచారం చేసినట్లు రుజువైతే అభ్యర్థులకు రెండేళ్ల జైలు శిక్షతోపాటు.. జరిమానా ఉంటుందని వెల్లడించింది.

ts election commission said after 29th 6pm election campaign ban
ఆ టైమ్​ తర్వాత ప్రచారం చేస్తే.. రెండేళ్ల జైలు, జరిమానా

By

Published : Nov 28, 2020, 3:58 PM IST

ఆదివారం సాయంత్రం ఆరుగంటలకల్లా ప్రచారానికి మగింపు పలకాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీచేసింది. అభ్యర్థులు ఎటువంటి ప్రచారమైనా 29వ రోజు సాయంత్రం ఆరు గంటలలోపు చేసుకోవాలన్నారు.

ఆ తర్వాత ఎన్నికల కోడ్ అమలులో ఉన్న జీహెచ్ఎంసీ పరిధిలో ఎటువంటి ప్రచారాన్ని అనుమతించబడదని ఈసీ స్పష్టం చేసింది. పోలింగ్ జరిగే 48 గంటల ముందు ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేసే సంప్రదాయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

వ్యక్తిగత సభ, సమావేశాలు, ప్రసార మాధ్యమాలు ఇలా ఎటువంటి ప్రచారమైనా.. ఆదివారం సాయంత్రం ఆరు గంటల తర్వాత చేసినట్లు రుజువైతే అభ్యర్థులకు రెండేళ్ల జైలు శిక్షతోపాటు.. జరిమానా విధిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది.

ఇదీ చూడండి :గ్రేటర్​లో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి ఎన్నికల ప్రచారం

ABOUT THE AUTHOR

...view details