TS Election Campaign in Full Josh : శాసనసభ ఎన్నికల వేళ.. రాజకీయ పార్టీల ప్రచారాలు జోరు జోరుగా హోరెత్తుతున్నాయి. ఎల్బీనగర్ నియోజకవర్గంలో కొత్తపేట మారుతీనగర్‌లో.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధుయాష్కీ గౌడ్.. పాదయాత్ర చేస్తూ.. ఓట్లు అభ్యర్థించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి సతీమణి విజయలక్ష్మి.. జనప్రియ మహానగర్‌లో ఇంటింటి ప్రచారంలో(Door to Door Campaign) పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం తూంకుంట మున్సిపాలిటీలోని పలు గ్రామాల్లో.. కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్.. రోడ్‌షో చేపట్టారు.
అధికార పార్టీ లోపాలే అస్త్రాలుగా చేసుకుని ప్రతిపక్ష పార్టీల ప్రచారాలు
తొమ్మిదన్నర సంవత్సరాల్లో నిరుద్యోగులను, ఉద్యోగులను, బడుగు బలహీన వర్గాలను మోసం చేసి.. ఏ ఒక్క హామీ నిలబెట్టుకొని కేసీఆర్ కు ఎందుకు ఓటేయాలో తెలపాలని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి(BJP Chief Kishan Reddy) ప్రశ్నించారు. హైదరాబాద్ అంబర్‌పేటలోని ప్రేమ్‌నగర్‌లో.. కమలం పార్టీ అభ్యర్థి కృష్ణయాదవ్‌తో కలిసి.. కిషన్‌రెడ్డి పాదయాత్ర నిర్వహిస్తూ.. ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఎల్బీనగర్ నియోజకవర్గ గడ్డి అన్నారంలో డివిజన్‌లో.. బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి.. పాదయాత్రగా ప్రచారం నిర్వహిస్తూ.. టీలు అమ్ముతూ, క్షవరం చేస్తూ ఆకట్టుకున్నారు.
Telangana Election Raging with Campaigning : సికింద్రాబాద్ నియోజకవర్గం.. మనికేశ్వరి నగర్‌లో.. భారతీయ జనతా పార్టీ(BJP) అభ్యర్థి మేకల సారంగపాణి.. ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆదిలాబాద్ అభ్యర్థి జోగురామన్న కుమారుడు.. పురపాలక సంఘం అధ్యక్షుడు జోగు ప్రేమేందర్.. ఆదిలాబాద్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి సతీమణి సాయి మౌనారెడ్డి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.
బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాయల్ శంకర్ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పట్టణంలోని మహాలక్ష్మివాడ, తిర్పెల్లి కాలనీల్లో ర్యాలీలు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియంలో వాకర్లని కాంగ్రెస్ అభ్యర్థి.. వివేక్ ఓట్లు అభ్యర్థించారు. నిజామాబాద్ జిల్లా ఇంధల్వాయి మండలంలో బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్థన్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బోధన్ నియోజకవర్గంలో కమలం అభ్యర్థి.. వడ్డి మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.