గురువారం నుంచి జరగాల్సిన ఇంజినీరింగ్ రెండో విడత ఎంసెట్ కౌన్సిలింగ్ను ఆపాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. టీఎస్ ఎంసెట్ రాసేందుకు ఇంటర్లో కనీసం 45 శాతం మార్కులు ఉండాలన్న నిబంధనను ఎత్తివేయాలని కోరుతూ కొందరు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించకుండా.. అందరికీ 35 శాతం మార్కులు వేసి ఉత్తీర్ణులను చేసినట్లు పిటిషనర్లు వాదించారు.
రాష్ట్రంలో ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సిలింగ్ ఆపాలి: హైకోర్టు - ఎంసెట్ కౌన్సిలింగ్ తాజా వార్తలు
టీఎస్ ఎంసెట్ రాసేందుకు ఇంటర్ మార్కులపై ఉన్న నిబంధనను ఎత్తివేయాలని కోరుతూ కొందరు విద్యార్థులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు విచారణ జరిపిన న్యాయస్థానం గురువారం నుంచి జరగాల్సిన ఇంజినీరింగ్ రెండో విడత ఎంసెట్ కౌన్సిలింగ్ను ఆపాలని ఆదేశించింది
రాష్ట్రంలో ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సిలింగ్ ఆపాలి: హైకోర్టు
కొందరు విద్యార్థులకు అన్యాయం జరిగిందనే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని.. ఎంసెట్ నిబంధనలను సవరిస్తూ రెండు, మూడు రోజుల్లో జీవో ఇవ్వనున్నట్లు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వివరించారు. ఏజీ వివరణను హైకోర్టు నమోదు చేసుకుంది. ఈ మేరకు గురువారం నుంచి జరగాల్సిన కౌన్సిలింగ్ ప్రక్రియను వాయిదా వేయాలని ఆదేశించింది.
ఇదీ చదవండిఃఇంజినీరింగ్ సీటు పొందిన అభ్యర్థుల సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు పొడిగింపు