ప్రజాధనంతో కేసీఆర్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని వీరప్ప మొయిలీ ఆరోపించారు. సీఎం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 29 శాతం ఓట్లు వచ్చాయని... మా సీట్లను ఎత్తుకెళ్లిపోతారా అనిసీనియర్ నేత జైపాల్రెడ్డిప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేస్తారా... అని ధ్వజమెత్తారు.ఈ ఫిరాయింపుల వ్యవహారంపై న్యాయ పోరాటానికి కూడా కాంగ్రెస్ సిద్ధమైంది.
కేసీఆర్ తీరుపై గవర్నర్‌కు కాంగ్రెస్ నేతల ఫిర్యాదు - కాంగ్రెస్ నేతలు
వీరప్పమొయిలీ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు కేసీఆర్ తీరుపై గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న గులాబీ అధిపతిపై చర్యలు తీసుకోవాలని... ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేలా స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
కేసీఆర్ తీరుపై గవర్నర్‌కు కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
ఇదీ చూడండి :16 స్థానాల్లో తెరాసకు ఎంఐఎం మద్దతు: అసదుద్దీన్