అసెంబ్లీ, మండలి నిర్వహణపై పోచారం, గుత్తా ప్రత్యేక సమావేశం - పోచారం శ్రీనివాస్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి
09:41 September 16
అసెంబ్లీ, మండలి నిర్వహణపై పోచారం, గుత్తా ప్రత్యేక సమావేశం
శాసనసభ, శాసనమండలి నిర్వాహణపై స్పీకర్ ఛాంబర్‌లో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సమావేశాల్లో పాల్గొంటున్న సభ్యులు, విధుల్లో ఉన్న సిబ్బంది రక్షణను దృష్టిలో ఉంచుకుని సమావేశాల కుదింపు అంశంపై సమీక్షించారు. అనంతరం శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని పిలిపించిన పరిస్థితులను తెలియజెప్పారు. ఉదయం సభ ప్రారంభానికి ముందు ఈ భేటీ జరిగింది.
ఈ సమీక్షా సమావేశంలో అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు పాల్గొన్నారు. అధికారికంగా శాసనసభ సమావేశాల కుదింపుపై సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించనున్నారు.
ఇదీ చూడండి :సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్ పరిధిలో అగ్నిప్రమాదం