TS Anganwadi Teachers in PRC : అంగన్‌వాడీ టీచర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలో ప్రకటించనున్న పీఆర్సీలో అంగన్వాడీలను చేర్చాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు తన నివాసానికి వచ్చిన అంగన్‌వాడీ హెల్పర్స్ యాక్షన్ కమిటీ, సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులకు మంత్రి హరీశ్‌రావు(Minister Harish Rao) వివరించారు. మధ్యాహ్న భోజనాలకు సంబంధించిన పెండింగ్ బిల్లుల(Mid Day Mill Pending Bills)ను సైతం విడుదల చేసినట్టు ప్రకటించారు. అంగన్వాడీల ఇతర డిమాండ్లపై సానుకూలంగా స్పందించి వాటిపై తొందరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.
TS Anganwadi Teachers in PRC : అంగన్‌వాడీ ఉపాధ్యాయులకు ప్రభుత్వం శుభవార్త - Anganwadi Pending Bills Release
Published : Oct 1, 2023, 12:01 PM IST
|Updated : Oct 1, 2023, 12:30 PM IST
11:56 October 01
TS Anganwadi Teachers in PRC : అంగన్‌వాడీ ఉపాధ్యాయులకు ప్రభుత్వం శుభవార్త
ప్రభుత్వ నిర్ణయం వల్ల 70 వేల మంది అంగన్‌వాడీ ఉద్యోగులకు లాభం చేకూరుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. అంగన్వాడీల అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు.
Anganwadi Staff Strike in Mahabubnagar : అంగన్వాడీల సమ్మెబాట.. కేంద్రాల్లో నిలిచిపోయిన సేవలు
కొత్తగా 10 లక్షల పెన్షన్లు.. 5వేల అంగన్‌వాడీ పోస్టులు.. కేబినెట్లో కీలక నిర్ణయాలు