అమెరికాలో ఉంటున్న తెలుగు బాలిక అన్నపురెడ్డి శ్రావ్య సేవాగుణాన్ని చాటింది. కరోనా కట్టడిలో కృషి చేస్తున్న వివిధ విభాగాల సిబ్బందికి కుకీలు అందించింది. ఏపీలోని గుంటూరు జిల్లా బాపట్ల మండలం నరసాయపాలేనికి చెందిన అన్నపురెడ్డి సీతాకలామ్, విజయరెడ్డి కూతురే శ్రావ్య.
బాపట్ల బాలికకు ట్రంప్ ప్రశంసలు! - శ్రావ్యను అభినందించిన ట్రంప్
సేవకు వయసుతోనే పనేముంది అని నిరూపించిందో చిన్నారి. చిన్న వయసులోనే ఆమెకు జీవితాంతం గుర్తించుకో దగ్గ బహుమతి దక్కింది. కోవిడ్ సంక్షోభంతో తల్లడిల్లుతున్న అమెరికాలో తన వంతు బాధ్యతగా సేవ చేసి... అమెరికా అధ్యక్షుడి నుంచి స్వయంగా అభినందనలు అందుకుంది.
బాపట్ల బాలికకు ట్రంప్ ప్రశంసలు!
వైద్యులైన తల్లిదండ్రులిద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు. వారి అండతో శ్రావ్య చేసిన సేవను గుర్తించి... అమెరికాలోని శ్వేతసౌధంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆదేశ అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసాపత్రం అందజేసి.. చిన్నారిని అభినందించారు. శ్రావ్య మేరీల్యాండ్‌లోని హన్నోవర్ హిల్స్ ప్రాథమిక పాఠశాలలో చదువుతోంది.