తెలంగాణ

telangana

ETV Bharat / state

టీఆర్టీ ఆంగ్లమాధ్యమం ఎస్జీటీ ఫలితాలు విడుదల - TRT RESULTS UPDATES

trt-sgt-english-results-announce-today-news

By

Published : Nov 2, 2019, 7:01 PM IST

Updated : Nov 2, 2019, 10:56 PM IST

15:03 November 02

టీఆర్టీ ఆంగ్లమాధ్యమ ఎస్జీటీ ఫలితాల విడుదల

టీఆర్టీ ఆంగ్లమాధ్యమ ఎస్జీటీ ఫలితాల విడుదల

    టీఆర్టీ ఆంగ్లమాధ్యమం ఎస్జీటీ ఫలితాలను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎట్టకేలకు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 843 మందిని  టీఎస్పీఎస్సీ ఎంపిక చేసింది. ఉపాధ్యాయ నియామక పరీక్షలో భాగంగా... తెలుగు, ఆంగ్ల మాధ్యమం, సెకండరీ గ్రేడ్ టీచర్ ఫలితాలను గతంలోనే కమిషన్ వెల్లడించింది. కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించటం వల్ల... మరోసారి రీలింక్విష్​మెంట్ తీసుకుని సెప్టెంబరు 30లోగా మళ్లీ ఫలితాలు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. సెప్టెంబరు 30 దాటినప్పటికీ... ఫలితాలు రాకపోవటం వల్ల అభ్యర్థులు ఆందోళనలకు దిగారు. ఇటీవలే తెలుగు మాధ్యమం ఎస్జీటీ ఫలితాలను విడుదల చేసిన టీఎస్పీఎస్సీ... ఇవాళ ఆంగ్ల మాద్యమం ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 909 ఉద్యోగాల కోసం నియామక ప్రక్రియ నిర్వహించినప్పటికీ.... 843 మందిని ఎంపిక చేసినట్లు కమిషన్ తెలిపింది. దివ్యాంగుల కోటాలో ఎంపికైన 39 మంది అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలించిన తర్వాత ఫలితాలను ప్రకటిస్తామని తెలిపింది. కోర్టు వివాదాల కారణంగా 26 ఖాళీల ఫలితాలను ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు పేర్కొంది.

ఇవీ చూడండి: పవర్ స్టార్ అభిమానులు పండుగ చేసుకునే వార్త..

Last Updated : Nov 2, 2019, 10:56 PM IST

ABOUT THE AUTHOR

...view details