రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఆర్టీ హిందీ స్కూల్ అసిస్టెంట్, వైద్య విద్య విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగ నియామక ఫలితాలను ప్రకటించింది. ఉపాధ్యాయ నియామక పరీక్ష.. టీఆర్టీలో భాగంగా 2017లో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. 158 హిందీ స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టిన టీఎస్పీఎస్సీ.. గురువారం 148 మందిని ఎంపిక చేసింది.
అర్హులు లేకపోవడం, కోర్టు కేసుల వంటి కారణంగా మరో పది పోస్టులు ఖాళీగా ఉన్నాయని టీఎస్పీఎస్సీ అదనపు కార్యదర్శి సుమతి తెలిపారు. వైద్య విద్య విభాగంలో 167 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిర్వహించిన రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫలితాలను ప్రకటించింది.