ప్రగతి భవన్ ఎదుట నిరసన తెలుపుతుండగా పోలీసులు అరెస్టు చేసిన టీఆర్టీ అభ్యర్థులు బొల్లారం పోలీస్ స్టేషన్లో ఆందోళన కొనసాగిస్తున్నారు. వెంటనే తమకు పోస్టింగ్లు కేటాయించాలని... లేనిపక్షంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని వారు హెచ్చరించారు. ప్రభుత్వం తమకు న్యాయం చేసేంత వరకు పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. బొల్లారంలో నిరసన తెలుపుతున్న ఓ మహిళ అభ్యర్థి కళ్లు తిరిగి సొమ్మసిల్లి పడిపోవడం వల్ల వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని... అంతవరకు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్లేది లేదని వారు తెలిపారు. టీఆర్టీ అభ్యర్థులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య రావటం వల్ల ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పోలీస్స్టేషన్లో టీఆర్టీ అభ్యర్థుల ఆందోళన - TRT Candidates protest Continue today news
ప్రగతిభవన్ వద్ద పోలీసులు అరెస్ట్ చేసిన టీఆర్టీ అభ్యర్థులు బొల్లారం పోలీస్ స్టేషన్ ఆందోళన చేస్తున్నారు. వర్షంలో తడుస్తూనే బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపారు.
TRT Candidates protest Continue at bollaram police station