తెలంగాణ

telangana

ETV Bharat / state

'నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి' - ఎంపీ రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలన్న టీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు

రాజకీయాల్లో హుందాతనం లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న ఎంపీ రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని టీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ డిమాండ్ చేశారు.

trsv leader gellu srinivas  fire on mp revanthreddy at hyderabad
నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి

By

Published : Jul 16, 2020, 10:58 AM IST

రాజకీయాలు ఎంపీ రేవంత్ రెడ్డికి పిచ్చోడి చేతిలో రాయిలా మారాయని టీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ అన్నారు. అలాంటి నాయకులు కాంగ్రెస్​ను చవకబారు ఎజెండాలతో మరింతగా దిగజారుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏదో ఒక రకంగా నూతన సచివాలయం కట్టకుండా సీఎం కేసీఆర్‌ను అడ్డుకునే కుట్రలో భాగంగానే గుప్త నిధుల ఆరోపణలు చేశారని మండిపడ్డారు.

రాజకీయాల్లో హుందాతనం లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న రేవంత్... సచివాలయం గుప్త నిధులపై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను తప్పిస్తారంటూ చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:లక్షణాలు లేకుండా కరోనా బారిన పడిన వారు ఏం చేయాలి..?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details