తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ నెల 7న తెరాస శాసనసభాపక్ష సమావేశం - తెరాస శాసనసభాపక్ష సమావేశం తాజా వార్తలు

సెప్టెంబర్​ 7న తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష సమావేశం కానుంది. ఇటీవల మరణించిన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి తెరాస శాసనసభ పక్షం సంతాపం వ్యక్తం చేస్తూ తీర్మానం చేయనుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

ఈ నెల 7న తెరాస శాసనసభాపక్ష సమావేశం
ఈ నెల 7న తెరాస శాసనసభాపక్ష సమావేశం

By

Published : Sep 3, 2020, 8:22 PM IST

తెరాస శాసనసభాపక్షం ఈ నెల 7న భేటీ కానుంది. హైదరాబాద్​ తెలంగాణ భవన్​లో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సెప్టెంబర్​ 7న సాయంత్రం 5 గంటలకు సమావేశం జరగనుంది. ఈ భేటీకి తెరాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరినీ ఆహ్వానించారు.

ఇటీవల మరణించిన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి తెరాస శాసనసభ పక్షం సంతాపం వ్యక్తం చేస్తూ తీర్మానం చేయనుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

ఇదీ చూడండి:ఆసిఫాబాద్‌లో రెండోరోజు డీజీపీ మహేందర్​రెడ్డి పర్యటన

ABOUT THE AUTHOR

...view details