తెలంగాణ

telangana

ETV Bharat / state

పుర ఫలితాల్లో విజయఢంకా మోగిస్తాం: పల్లా - TRS WOULD ROCKS IN MUNICIPAL POLLS SAYS PALLA

పురపాలక ఎన్నికల్లో తెరాస విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. క్యాంప్ రాజకీయాలపై మాట్లాడే అర్హత కాంగ్రెస్, భాజపాలకు లేదని పల్లా విమర్శించారు.

మున్సిపల్ ఫలితాల్లో తెరాసదే హవా : పల్లా
మున్సిపల్ ఫలితాల్లో తెరాసదే హవా : పల్లా

By

Published : Jan 24, 2020, 8:47 PM IST

మున్సిపల్ ఎన్నికల్లో తెరాస విజయఢంకా మోగించటం ఖాయమని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఫలితాలు ప్రతిపక్షాలకు కనువిప్పు అవుతాయన్నారు. ఎన్నికలు ఈవీఎంలతో జరిగినా... బ్యాలెట్ పేపర్​తో జరిగినా హవా తెరాసదేనని స్పష్టం చేశారు. భాజపాకి ఈ ఎన్నికల్లో మతం తప్ప మరో అంశం దొరకలేదన్నారు.

క్యాంప్​ రాజకీయాలపై మాట్లాడే అర్హత కాంగ్రెస్, భాజపాలకు లేదు...

ప్రతి పక్షాలకు మున్సిపల్​ ఎన్నికల్లో అభ్యర్థులు లేరంటూ పల్లా రాజేశ్వర్​ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, భట్టి ఇలాఖాల్లో తెరాస విజయం సాధించబోతోందని తెలిపారు. సీఎం కేసీఆర్ మీద ప్రజలకు విశ్వాసం ఉండబట్టే తెరాస అన్ని ఎన్నికల్లో విజయం సాధిస్తోందని ఆయన స్పష్టం చేశారు. క్యాంప్ రాజకీయాలపై మాట్లాడే అర్హత కాంగ్రెస్, భాజపాలకు లేదని పల్లా విమర్శించారు. ఓటమిని ప్రతిపక్షాలు హుందాగా అంగీకరించాలని హితవు పలికారు.

మున్సిపల్ ఫలితాల్లో తెరాసదే హవా : పల్లా

ఇవీ చూడండి : బస్తీమే సవాల్​: ఫలితాలపై టెన్షన్ టెన్షన్...కోట్లలో బెట్టింగ్..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details