గ్రేటర్ హైదరాబాద్ నేతలతో కేటీఆర్ భేటీ... ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చ - తెలంగాణ వార్తలు
18:11 February 27
గ్రేటర్ హైదరాబాద్ నేతలతో కేటీఆర్ భేటీ... ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చ
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నారు. తెలంగాణ భవన్‌లో గ్రేటర్ హైదరాబాద్ నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, జీహెచ్ఎంసీ తెరాస కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు వ్యూహంపై చర్చిస్తున్నారు.
వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానంతో పాటు హైదరాబాద-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానాన్ని కూడా తెరాస గెలుచుకోవాలని కేటీఆర్ చెప్పారు. ఆ దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు.
ఇదీ చదవండి:'మంత్రి కేటీఆర్ సహాయం ఎప్పటికీ మర్చిపోలేం'