సమగ్ర కుటుంబ సర్వే దేశ చరిత్రలోనే సంచలనం సృష్టించిందని తెరాస కార్వనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR AT PLENARY)అన్నారు. ఒక్కరోజులోనే తెలంగాణ ముఖచిత్రం ఆవిష్కరించిందని కొనియాడారు. హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో ఏర్పాటు చేసిన తెరాస ప్లీనరీలో ఆయన మాట్లాడారు. తెరాస ప్లీనరీలో కేటీఆర్ తీర్మానం ప్రవేశ పెట్టారు. పాలనాసంస్కరణలు, విద్యుత్, ఐటీ, పారిశ్రామికాభివృద్ధిపై తీర్మానం చదివి వినిపించారు.
తెలంగాణలో 'త్రీ ఐ' సూత్రం పాటిస్తున్నామని ప్రధానికి చెప్పినట్లు తెలిపిన కేటీఆర్ (KTR AT PLENARY)... 'త్రీ ఐ' అంటే.. ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్‌క్లూసివ్ గ్రోత్ అని పేర్కొన్నారు. త్వరలోనే సమగ్ర భూ సర్వే నిర్వహిస్తామని వెల్లడించారు. అక్షాంక్షాలు, రేఖాంశాలతో భూమి గుర్తించి పాసుపుస్తకాలు జారీ చేయనున్నట్లు తెలిపారు.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఒక నవ భారత్ నిర్మాణానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులను ప్రధాని ఆహ్వానించారు. మన పార్టీ తరఫున కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నేను ఆ కార్యక్రమానికి హాజరయ్యాను. తెలంగాణలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో 'త్రీ' ఐ మంత్ర నడుస్తుందని చెప్పాను. 'త్రీ' ఐ అంటే ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్‌క్లూసివ్ గ్రోత్ ఈ మూడు దేశమంతా అమలు చేయగలిగితే ఒక కొత్త భారతదేశాన్ని నిర్మించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వానికి తెలిపా. కేసీఆర్ అంటే.. కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు. నిరంతర విద్యుత్‌తో నిరంతర సంపద సృష్టి జరుగుతోంది. గూగుల్‌కు గుండెకాయ హైదరాబాద్. అమెజాన్‌కు ఆయువుపట్టు హైదరాబాద్. ఐటీ అంటే... ఇన్‌క్రెడిబుల్ తెలంగాణ. దేశంలోనే అతిగొప్ప స్టార్టప్ తెలంగాణ రాష్ట్రం. సమగ్ర కుటుంబ సర్వే వల్లే సంక్షేమాన్ని ప్రతి గడపకు తీసుకెళ్లాం. బంగాల్ ఆలోచించేది దేశం ఆలోచిస్తుంది అనేది ఒకప్పటి నానుడి. ఇప్పుడు తెలంగాణ ఆలోచించిందే దేశం ఆలోచిస్తోంది. గిరిజన తండాలకు వారినే పాలకులుగా మార్చాం.
--కేటీఆర్, తెరాస కార్వనిర్వాహక అధ్యక్షుడు
'తెలంగాణలో 'త్రీ ఐ' నడుస్తోందని చెప్పా' ఇదీ చూడండి:KCR speech in trs plenary: ఏడేళ్లలో అపోహలన్నీ పటాపంచలు చేశాం: కేసీఆర్