Rythu Bandhu Sambaralu until sankranthi : రైతు బంధు ఉత్సవాలు సంక్రాంతి వరకు జరుపుకోవాలని పార్టీ శ్రేణులకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 10 వరకు రైతు బంధు ఉత్సవాలు జరపాలని గతంలో తెరాస పిలుపునిచ్చింది.
Rythu Bandhu Sambaralu until sankranthi : 'సంక్రాంతి వరకు రైతుబంధు ఉత్సవాలు జరుపుకోవాలి' - సంక్రాంతి వరకు రైతుబంధు ఉత్సవాలు చేసుకోవాలన్న కేటీఆర్
Rythu Bandhu Sambaralu until sankranthi : రైతుబంధు ఉత్సవాలను సంక్రాంతి వరకు జరుపుకోవాలని పార్టీ శ్రేణులకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు.
KTR
అయితే, కరోనా పరిస్థితుల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 10వరకు ర్యాలీలు, ప్రదర్శనలపై నిషేధం వంటి పరిమితులు ఉన్నందున సంక్రాంతి వరకు కొనసాగించాలని నిర్ణయించినట్టు కేటీఆర్ తెలిపారు. రైతు బంధు ఉత్సవాల్లో కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని మరోసారి పార్టీ శ్రేణులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి:Rythu Bandhu Funds: 60 లక్షల మందికి పైగా లబ్ధి చేకూర్చిన రైతుబంధు పథకం