ఓటింగ్‌కు దూరంగా విపక్షాలు
నోటిఫికేషన్ విడుదలైన నాటికి నామినేటెడ్ ఎమ్మెల్యేలతో కలిపి తెరాసకు 91 మంది సభ్యులు, ఎంఐఎంకు ఏడుగురు ఉన్నారు. కాంగ్రెస్‌కు 19మంది.. తెదేపాకు ఇద్దరు, భాజపాకు ఒకరు ఉన్నారు. ఆ తర్వాత హస్తం ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు, హరిప్రియ నాయక్, చిరుమర్తి లింగయ్య, తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గులాబీ పార్టీకి మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎన్నికను బహిష్కరించాలని కాంగ్రెస్ నిర్ణయించగా.. తెదేపా, భాజపా ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఉప సభాపతి పద్మారావు సహా తెరాసకు చెందిన 91 మంది.. ఎంఐఎం సభ్యులు ఏడుగురు ఓట్లు వేశారు. మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్ రెడ్డికి ఒక్కొక్కరికి ఇరవై మంది.. ఎగ్గె మల్లేషం, మజ్లిస్ అభ్యర్థి మిర్జా రియాజ్ ఉల్ హసన్ అఫండీకి ఒక్కొక్కరికి 19 మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేశారు. గెలుపొందిన నేతలు సంతోషం వ్యక్తం చేశారు.