తెరాస సీనియర్ మహిళా నాయకురాలు ఒకరు శనివారం మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో ఆయన నివాసంలో భేటీ అయినట్లు తెలిసింది. ఆమె గతంలో జడ్పీ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. పార్టీలో రాష్ట్రస్థాయి మహిళా నేతగా ఉన్నారు. గత శాసనసభ ఎన్నికల సమయంలో పార్టీ మారతారని ప్రచారం జరిగింది.
మాజీ మంత్రి ఈటలను కలిసిన తెరాస మహిళా నేత..? - eetala rajender latest news
తెరాసకు చెందిన ఓ మహిళా నేత మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసినట్లుగా వచ్చిన వార్తలు చర్చనీయ అంశంగా మారాయి. గతంలో ఆమె పార్టీ తరఫున పలు పదవులు ఆశించినా.. ఫలితం దక్కలేదని సమాచారం.
ఈటల రాజేందర్‌ను కలిసిన తెరాస మహిళా నేత
తెరాస తరఫున ఎమ్మెల్సీ పదవితో పాటు నియమిత పదవుల కోసం గతం ఆమె ప్రయత్నించినా.. దక్కలేదు. అసంతృప్తితో ఉన్న సదరు నేత ఈటలను కలిసినట్లుగా తెలుస్తోంది. తాజాగా జరుగుతున్న పరిణామాలపై ఆమె వివరణ కోసం ప్రయత్నించగా స్పందించలేదు.