తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరాసలో టికెట్​ కోసం పోటాపోటీ.. సిట్టింగ్​లకే ఇచ్చే అవకాశం.. - తెరాస జీహెచ్​ఎంసీ అభ్యర్థులు

గ్రేటర్ హైదరాబాద్ తెరాస ఆశావహులు ఉత్కంఠతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సీటు దక్కుతుందో లేదోనని ఊపరిబిగపట్టి ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఏ నిమిషాన్నైనా జాబితా ప్రకటించేందుకు గులాబీ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఎక్కువ శాతం సిట్టింగ్ అభ్యర్థులకే మరోసారి టికెట్లివ్వాలని తెలంగాణ రాష్ట్ర సమితి భావిస్తోంది. తమకు అవకాశం ఇవ్వాలని కేసీఆర్, కేటీఆర్ పై వివిధ వర్గాల ద్వారా ఒత్తిడి తెచ్చేందుకు ఆశావహులు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు.

trs will release candidate list for ghmc elections
తెరాసలో టికెట్​ కోసం పోటాపోటీ.. సిట్టింగ్​లకే ఇచ్చే అవకాశం..

By

Published : Nov 17, 2020, 10:57 PM IST

గ్రేటర్ ఎన్నికల నగారా మోగడంతో తెరాసలో టిక్కెట్ల కోసం ప్రయత్నాలు తారస్థాయికి చేరాయి. మహా నగరంలోని 150 డివిజన్లలో తెరాస తరఫున పోటీ చేసేందుకు విపరీతమైన పోటీ నెలకొంది. దాదాపు ప్రతీ డివిజన్‌లోనూ కనీసం అరడజను నుంచి డజను మంది నాయకులు టికెట్​ ఆశిస్తున్నారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ను ఆకర్షించేందుకు కొన్ని రోజులుగా నేతలు వివిధ రూపాల్లో ప్రయత్నిస్తున్నారు. లాక్‌డౌన్, వరదల వేళ చురుగ్గా సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటూ కేటీఆర్‌కు ట్విట్టర్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా చేరవేసి ఆయన దృష్టిలో పడేందుకు పోటీపడ్డారు. మరి కొందరు వివిధ సందర్భాల్లో నేరుగా కలిసి బయోడేటాలు ఇచ్చారు. ఇంకొందరు కేసీఆర్ దృష్టిలో తమ పేర్లు ఉండేలా నేతలతో పైరవీలు చేసుకున్నారు.

పాత వారికే మళ్లీ అవకాశం

రేపటి నుంచి నామినేషన్లు ప్రారంభం కానుండటంతో.. తెరాస నాయకత్వం జాబితాకు తుది మెరుగులు పెడుతోంది. ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్నందున.. కొత్తవారికిస్తే దూసుకెళ్లేందుకు కొంత సమయం పడుతుందని భావనలో ఉన్న గులాబీ పార్టీ.. పాత వారికే మళ్లీ అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తోంది. వ్యూహంలో భాగంగానే మరో ఐదేళ్ల పాటు రిజర్వేషన్లు కొనసాగించేలా చట్ట సవరణకు ప్రభుత్వం చొరవ తీసుకున్నట్లు తెలుస్తోంది. కొందరు పనితీరు బాగా లేదని సర్వేల్లో తేలడం.. మరికొందరికి అనారోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని.. దాదాపు 20 నుంచి 30 స్థానాల్లో సిట్టింగ్‌లను మార్చనున్నట్లు తెలుస్తోంది. కొందరు ఉద్యమ కాలం నుంచి పార్టీలో ఉన్నామని.. మరికొందరు టికెట్​పై ఆశతోనే ఇతర పార్టీల నుంచి వచ్చామంటూ ఒత్తిడి తెస్తున్నారు.

ఎంఐఎంతో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నప్పటికీ

ఎంఐఎంతో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నప్పటికీ.. పాతబస్తీలోని డివిజన్లు సహా 150 స్థానాల్లో తెరాస అభ్యర్థులను నిలబెట్టనుంది. ఈ రాత్రికి లేదా రేపు ఉదయం 100కి పైగా అభ్యర్థులను ప్రకటించేందుకు జాబితా సిద్ధమైంది. సిట్టింగులు పోటీ చేసే ప్రాంతాలపై ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేలకు పార్టీ నాయకత్వం స్పష్టతనిచ్చింది. కొందరు నామినేషన్ పత్రాలను కూడా సిద్ధం చేసి పెట్టుకున్నారు. మరోవైపు అభ్యర్థులను ప్రకటించగానే ఆశావహుల నుంచి పెద్ద ఎత్తున అసమ్మతి, అసంతృప్తి పెల్లుబికొచ్చని అంచనా వేస్తున్న తెరాస..అప్రమత్తంగా ఉండాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇప్పటికే స్పష్టం చేసింది. క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించేది లేదని.. అవసరమైతే భవిష్యుత్తులో ఇతర పదవుల్లో అవకాశం ఉంటుందన్న భరోసా ఇవ్వాలని ఎమ్మెల్యేలకు తెరాస నాయత్వం వివరించింది.

ఇదీ చదవండి:గ్రేటర్​ పోరు... వందకుపైగా సీట్లు గెలిచేలా తెరాస వ్యూహాలు

ABOUT THE AUTHOR

...view details