కేంద్ర ప్రభుత్వం ఆదివారం రాజ్యసభలో ప్రవేశపెట్టే వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తామని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు తెలిపారు. రైతులకు తీవ్ర నష్టం కలిగించేలా.. కార్పొరేట్లకు మేలు చేసేలా కేంద్రం బిల్లులు తీసుకొచ్చిందని దిల్లీలో ఆరోపించారు. రాష్ట్రాల హక్కులను లాక్కోవాలని కేంద్రం చూస్తోందన్నారు.
ఆ బిల్లులకు మేము వ్యతిరేకం: కే కేశవరావు - తెరాస ఎంపీ కే కేశవరావు
ఆదివారం రాజ్యసభలో ప్రవేశపెట్టే వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తామని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు స్పష్టం చేశారు. రైతులకు తీవ్ర నష్టం కలిగించేలా.. కార్పొరేట్లకు మేలు చేసేలా కేంద్రం బిల్లులు తీసుకొచ్చిందని దిల్లీలో ఆరోపించారు.
ఆ బిల్లులకు మేము వ్యతిరేకం: కే కేశవరావు
కనీస మద్దతు ధరకు బదులు నాన్ మార్కెట్ జోన్ ఏర్పాటు చేసి రైతులను ఇబ్బందులు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రైతు వ్యతిరేక బిల్లులను తిప్పికొడతామని కేకే అన్నారు. రాష్ట్రంలో రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో ఆన్నదాతలను ఆదుకుంటూ సీఎం కేసీఆర్ ముందుకెళ్తుంటే.. కేంద్రం.. రైతులకు అన్యాయం చేస్తోందని తెరాస లోక్ సభాపక్షనేత నామ నాగేశ్వరరావు మండిపడ్డారు.
ఇదీ చదవండి:వ్యవసాయబిల్లును వ్యతిరేకించండి.. తెరాస ఎంపీలకు సీఎం ఆదేశం