MahilaBandhu: ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆరో తేదీ నుంచి మూడు రోజుల పాటు మహిళా బంధు కేసీఆర్ పేరిట రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున సంబురాలను నిర్వహించాలని తెరాస నిర్ణయించింది. ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ శ్రేణులకు సూచించారు. గురువారం ఆయన మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో తన నివాసం నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు.
మహిళా సంక్షేమంలో మిన్న
‘‘కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఇప్పటిదాకా సుమారు 10 లక్షల 30 వేల మంది పేదింటి ఆడపడుచులకు రూ.9,022 కోట్లను అందించిన దేశంలోని తొలి ప్రభుత్వం మనదే. ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథతో ఆడబిడ్డల నీటి కష్టాలను దూరం చేశారు. మాతా శిశు సంరక్షణ కోసం కేసీఆర్ కిట్ల ద్వారా ఇప్పటి వరకు సుమారు 11 లక్షల మందికి రూ.1,700 కోట్ల లబ్ధి కలిగింది. ప్రభుత్వ పాఠశాలల బలోపేతంతో పాటు, బాలికలకు ప్రత్యేకంగా గురుకులాలు, జూనియర్, డిగ్రీ కళాశాలలను తెచ్చాం. 70 లక్షల ఆరోగ్య కిట్లను విద్యార్థులకు అందించాం. ఇతరులు బేటీ బచావో బేటీ పఢావో అంటూ కేవలం నినాదాలు ఇస్తున్న సమయంలో నిజంగా విద్యార్థులను చదివించి, సంరక్షిస్తున్న ప్రభుత్వం మనదే. రాజకీయ, పారిశ్రామిక రంగాలలోనూ మహిళలను ప్రోత్సహిస్తున్నాం. వీటన్నింటిని రాష్ట్రంలోని మహిళలందరికీ తెలియజేయాలి’’ అని కేటీఆర్ సూచించారు.
కార్యక్రమాలు ఇలా...