పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభర్థులు గెలుపొందటంపై ఉస్మానియా వర్శిటీలో సంబురాలు జరుపుకున్నారు. తెరాస విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో టపాసులు పేల్చి.. మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి చటారి దశరథ్ మాట్లాడుతూ... తెరాస అభ్యర్థులకు ఓట్లు వేసిన పట్టభద్రులు, ఉద్యోగులు, మేధావులకు ధన్యవాదాలు తెలిపారు.
నాగార్జునసాగర్‌లోనూ తెరాస జెండా ఎగురవేస్తాం: చటారి దశరథ్ - ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు.. భాజపా చేస్తున్న అసత్య ప్రచారాలకు సమాధానమని తెరాస విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి చటారి దశరథ్ అన్నారు. తెరాసకు అండగా నిలిచిన పట్టభద్రులకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలో జరగబోయే సాగర్ ఉప ఎన్నికలోనూ తెరాస జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థుల విజయం.. భాజపా నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలకు సమాధానమని చటారి దశరథ్ అన్నారు. తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారనే వాదనకు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని స్పష్టం చేశారు. రాబోయే నాగార్జునసాగర్ ఉప ఎన్నికలోనూ తెరాస జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం నేతలు కాటం శివ, ప్రశాంత్, క్రాంతి, నరేశ్, రాజేశ్, రవి కిరణ్, శ్రవణ్ కుమార్, రామకృష్ణ, సురేష్, రమేశ్ గౌడ్ పాల్గొన్నారు.