తెలంగాణ

telangana

ETV Bharat / state

భాజపా గూటికి తెరాస సీనియర్ నేత ప్రఫుల్ రామ్​రెడ్డి దంపతులు - ghmc elections

గ్రేటర్ ఎన్నికలకు నగారా మోగిన వేళ వలసల పరంపర మొదలయింది. ముషీరాబాద్ నియోజకవర్గ తెరాస పార్టీ సీనియర్ నాయకులు ప్రఫుల్ రామ్​రెడ్డి-పద్మజ రెడ్డి దంపతులు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.

Trs senior leader Praful Ram Reddy-Padmaja couple who joined BJP
భాజపాలో చేరిన తెరాస సీనియర్ నేతలు ప్రఫుల్ రామ్​రెడ్డి-పద్మజ దంపతులు

By

Published : Nov 19, 2020, 2:21 PM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికలకు నగారా మోగిన నేపథ్యంలో వలసలు మొదలయ్యాయి. ముషీరాబాద్ నియోజకవర్గ తెరాస పార్టీ సీనియర్ నాయకులు ప్రఫుల్ రామ్​రెడ్డి-పద్మజ రెడ్డి దంపతులు భాజపాలో చేరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.

తెరాస పార్టీలో అంకితభావంతో పనిచేస్తున్న కార్యకర్తలు, నాయకులకు గుర్తింపు కరవైందని ప్రఫుల్ రామ్ రెడ్డి ఆరోపించారు. ఈ కార్యక్రమంలో భాజపా అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details