రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నల్లకుంట డివిజన్లోని నరసింహ బస్తీలో తెరాస సీనియర్ నాయకుడు దూసరి శ్రీనివాస్ గౌడ్ బత్తాయిలు పంపిణీ చేశారు. తెలంగాణను పచ్చని మాగాణిగా మార్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఒక ఇంజినీర్‌గా, కార్మికుడిగా పనిచేశారని అన్నారు.
మంత్రి పుట్టిన రోజు సందర్భంగా బత్తాయిల పంపిణీ - తెరాస సీనియర్ నాయకుడు దూసరి శ్రీనివాస్
హైదరాబాద్ నల్లకుంట డివిజన్లో తెరాస సీనియర్ నాయకుడు దూసరి శ్రీనివాస్ మంత్రి హరీష్ రావు పుట్టిన రోజును పురస్కరించుకొని ప్రజలకు బత్తాయిలు పంపిణీ చేశారు. మంత్రి పది కాలాల పాటు చల్లగా జీవించాలని కోరుకున్నారు.
![మంత్రి పుట్టిన రోజు సందర్భంగా బత్తాయిల పంపిణీ oranges distribution in nallakunta](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7458426-824-7458426-1591177119659.jpg)
మంత్రి పుట్టిన రోజు సందర్భంగా బత్తాయిల పంపిణీ
మంత్రి హరీష్ రావు పది కాలాల పాటు చల్లగా బతకాలని ఆ దేవుడిని కోరుకుంటున్నట్లు శ్రీనివాస్ వివరించారు. ఆయన ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ... తెలంగాణ ప్రజలకు సేవలు అందిస్తూ ఉండాలని ఆకాంక్షించారు.
ఇవీ చూడండి:కేంద్ర విద్యుత్తు చట్టంపై కేసీఆర్ గుస్సా..