జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నగరంలోని వివిధ నియోజకవర్గాలకు భిన్నంగా పశ్చిమ ప్రాంతంలోని నియోజకవర్గాల్లో ఫలితాలొచ్చాయి. ఇతర చోట్ల భాజపా అనూహ్యంగా ఆధిక్యం ప్రదర్శించగా... నాలుగు నియోజకవర్గాల్లో మాత్రం తెరాస అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది.
అధిక స్థానాలు కైవసం..
కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో 37 స్థానాలుంటే అందులో 32 స్థానాలు కైవసం చేసుకుంది. శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో 26 డివిజన్లు ఉండగా 23 స్థానాలు తెరాసకు దక్కాయి. ఆ పార్టీకి దక్కిన స్థానాల్లో సగానికి పైగా ఈ మూడు నియోజకవర్గాల నుంచే వచ్చాయి.