తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరాస ప్లీనరీ సమావేశాలకు ముస్తాబవుతున్న హైదరాబాద్ - హైదరాబాద్ తాజా వార్తలు

Trs Plenary Meeting yerpatlu: తెరాస ప్లీనరీ సమావేశానికి హైదరాబాద్ ముస్తాబవుతుంది. నగరంలోని రహదారులని గులాబీమయంగా మారాయి. ప్లీనరి జరిగే ప్రాంతంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

Trs Plenary Meeting yerpatlu
తెరాస ప్లీనరీ సమావేశానికి ఏర్పాట్లు

By

Published : Apr 26, 2022, 3:01 PM IST

Updated : Apr 26, 2022, 4:13 PM IST

Trs Plenary Meeting yerpatlu: తెరాస ప్లీనరీ సమావేశానికి హైదరాబాద్ ముస్తాబవుతుంది. నగరంలోని రహదారులు అన్నీ గులాబీమయంగా మారాయి. మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, మహమూద్ అలీ నేతృత్వంలో నగర ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పలుచోట్ల కటౌట్లు, ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. లిబర్టీ, గన్ పార్క్, బషీర్ బాగ్, అబిడ్స్ పరిసరాలతో పాటు పలు కూడళ్లలో గులాబీ జెండా తోరణాలు, కేసీఆర్, కేటీఆర్ కటౌట్లతో నింపేశారు.

రాష్ట్రం నలువైపుల నుంచి వచ్చే తెరాస నాయకులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు ముడు వేల మంది పార్టీ ప్రతినిధులు హాజరవుతుండగా అసౌకర్యం కలగకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ప్లీనరీ సమావేశం జరిగే పరిసరాలు గులాబీమయం అయ్యాయి.

Last Updated : Apr 26, 2022, 4:13 PM IST

ABOUT THE AUTHOR

...view details