తెలంగాణ

telangana

ETV Bharat / state

TRS Plenary: తెరాస ద్విదశాబ్ది ఉత్సవాలు.. శ్రేణుల్లో నూతనోత్సాహం

తెరాస శ్రేణుల్లో ప్లీనరీ కొత్త ఉత్సాహన్ని తీసుకొచ్చింది. ద్విదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్​లోని హైటెక్స్​లో ఘనంగా నిర్వహించారు. తెరాస నియామావళిని సవరిస్తూ పలు సవరణలు చేశారు. అధ్యక్షుడు లేనప్పుడు కార్యనిర్వాహక అధ్యక్షుడికే నిర్ణయాధికారం ఉండేలా తీర్మానించారు. ఈమేరకు అధికారాలు అప్పగిస్తూ పార్టీ నియామవళి సవరించారు. తెరాసలో కేటీఆర్ పాత్ర మరింత పెరగనుందనే సంకేతాలిచ్చారు. ఇక నుంచి జరిగే ప్లీనరీలను రెండ్రోజులపాటు జరపాలని నిర్ణయం తీసుకున్నారు.

TRS plenary in Hyderabad
తెలంగాణ రాష్ట్ర సమితి తొమ్మిదో ప్లీనరీ

By

Published : Oct 26, 2021, 5:16 AM IST

కరోనా పరిస్థితులు, ప్రభుత్వంపై ఎక్కువదృష్టివంటి కారణాలతో కొంతకాలం స్తబ్దుగా ఉన్న తెరాసకు ప్లీనరీ కొత్త ఊపునిచ్చింది. ద్విదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ప్లీనరీ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. అధ్యక్షుడు లేనప్పుడు కార్యనిర్వాహక అధ్యక్షుడికి అధికారాలు అప్పగిస్తూ పార్టీ నియయామళి సవరించడం కేటీఆర్ ప్రాముఖ్యత మరింత పెరగనుందనే సంకేతాలను ఇచ్చింది. ప్లీనరీ ఏర్పాట్లలో కేటీఆర్ అన్నీతానై చేపట్టగా సభను మాత్రం కేసీఆర్ అంతా తానై నిర్వహించారు. ఇక నుంచి జరగనున్న ప్లీనరీలను రెండు రోజుల పాటు నిర్వహించాలని తెరాస నిర్ణయించింది.

తెలంగాణ రాష్ట్ర సమితి తొమ్మిదో ప్లీనరీని ఘనంగా జరుపుకుంది. ఏప్రిల్‌లో జరగాల్సిన ప్లీనరీని నిర్వహించేందుకు ఇదే సరైన సమయంగా పార్టీ నాయకత్వం భావించింది. ఎంపిక చేసిన సుమారు 6 వేల మంది ప్రతినిధులతో నిర్వహించిన ప్లీనరీ పార్టీ శ్రేణుల్లో శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అభివృద్ధి, సంక్షేమకార్యక్రమాలు, ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దళితబంధుపై తీర్మానాలు చేయడం పార్టీ నాయకులకు సంతృప్తినిచ్చింది. తెరాస అధ్యక్షుడిగా పదోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన కేసీఆర్ తనపై పార్టీ శ్రేణులు పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా గురుతర బాధ్యత నిర్వహిస్తానని ప్రకటించారు.


పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన కేసీఆర్‌ ఇరవై ఏళ్ల పార్టీ ప్రస్థానం, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూనే.. తమదైనరీతిలో విపక్షాలకు చురకలు అంటించారు. మధ్య మధ్యలో తనదైన శైలిలో హాస్యోక్తులు చేస్తూ అందరిలో ఉత్సాహాన్ని నింపారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని విమర్శిస్తూనే నవంబరు 4 తర్వాత దళితబంధు కొనసాగుతుందని పేర్కొంటూ.. హుజురాబాద్ ఎన్నికల ప్రచారం ప్లీనరి సభ నుంచే చేశారు. హుజురాబాద్ ఎన్నికల ప్రచారానికి ఇక కేసీఆర్ వెళ్లకపోవచ్చునని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అన్ని అంశాలపై చర్చిచేందుకు సమయం సరిపోవడం లేదన్న నేతల సూచన మేరకు ఇక నుంచి జరగబోయే ప్లీనరీ సమావేశాలను రెండు రోజుల పాటు జరపాలని తెరాస నిర్ణయించింది.

పార్టీ నియమాళిలో పలుసవరణలు చేశారు. అధ్యక్షుడు లేనప్పుడు అధికారాలను కార్యనిర్వాహక అధ్యక్షుడికి అప్పగిస్తూ నియమావళిని సవరిస్తూ తీర్మానం చేశారు. ఇప్పటికే అన్నీ తానై బాధ్యతలు నిర్వహిస్తున్న కేటీఆర్ తాజా సవరణతో మరింత క్రియాశీలకంగా వ్యవహరించబోతున్నారనే చర్చ పార్టీ శ్రేణుల్లో మొదలైంది. రాష్ట్ర కార్యవర్గాన్ని నియమించే అధికారాన్ని తెరాస అధ్యక్షుడికి అప్పగిస్తూ సభ తీర్మానం చేసింది. త్వరలోనే రాష్ట్ర కార్యవర్గం, అనుబంధ సంఘాలను కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. జిల్లా, నియోజకవర్గాల పార్టీ నిర్మాణం బాధ్యతను తెరాస అధ్యక్షుడికే సభ అప్పగించింది. ప్రస్తుతం తెరాసలో జిల్లా కమిటీలు లేవు. నియోజవకవర్గ ఇంఛార్జీలే ఉన్నారు. ఈసారి జిల్లా కన్వీనర్, నియోజకవర్గ ఇంఛార్జీలని నియమించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ విషయంపై కేసీఆర్ త్వరలో స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.


ఇదీ చూడండి:

KCR Speech at Plenary: 'రాజీలేని పోరాటంతో సాధించుకున్నాం.. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాం'

ABOUT THE AUTHOR

...view details