తెలంగాణ

telangana

ETV Bharat / state

TRS Plenary: దేశానికే మార్గదర్శి కేసీఆర్... ఈనెల 25న హైటెక్స్​లో తెరాస ప్లీనరీ - trs party updates

కేసీఆర్... సర్కారు పాలన విజయాలు, సంస్కరణలు దేశానికే దిశానిర్దేశం చేస్తున్నాయని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (TRS Plenary) పేర్కొన్నారు. తెలంగాణలో వచ్చిన గుణాత్మక మార్పు దేశమంతటికీ మేలు చేస్తోందని... ఇక్కడి ప్రభుత్వ కార్యక్రమాలు అనేక రాష్ట్రాలతో పాటు కేంద్రానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయన్నారు. ఇవాళ తెలంగాణలో జరిగేది రేపు దేశమంతటా ఆచరించక తప్పదనే పరిస్థితి వచ్చిందని కేటీఆర్ అన్నారు. ఈనెల 25న హైటెక్స్​లో జరగనున్న పార్టీ ప్లీనరీ (TRS Plenary) కోసం పలు కమిటీలను కేటీఆర్ ప్రకటించారు.

TRS Plenary
హైటెక్స్​లో తెరాస ప్లీనరీ

By

Published : Oct 14, 2021, 9:35 PM IST

దేశానికే మార్గదర్శి కేసీఆర్... ఈనెల 25న హైటెక్స్​లో తెరాస ప్లీనరీ

తెలంగాణ రాష్ట్ర సమితి (TRS Plenary) ఇరవై ఏళ్లలో ఎన్నో సవాళ్లను అధిగమించి అనేక విజయాలను సాధించిందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ (Trs Working President Ktr) గుర్తు చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం... ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr) నాయకత్వంలో రాష్ట్రం పురోగమిస్తోందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పాలన విజయాలను, సంస్కరణలు, విధాన రూపకల్పనలు దేశానికే దిశానిర్దేశం చేస్తున్నాయన్నారు.

దేశమంతా...

తెలంగాణ పథకాలు, కార్యక్రమాలను దేశమంతా గమనిస్తూ, అభినందిస్తూ.. ఆశీర్వదిస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. తమను తెలంగాణలో కలపాలని నాందేడ్, రాయచూరు వంటి ప్రాంతాల్లో డిమాండ్లు వస్తున్నాయన్నారు. వివిధ రాష్ట్రాలే కాకుండా భారత ప్రభుత్వం కూడా స్ఫూర్తి పొందేలా తెరాస కార్యదక్షత రుజువైందని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో పలు పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. రైతుబంధును 11 రాష్ట్రాలతో పాటు పీఎం కిసాన్ పేరిట కేంద్ర ప్రభుత్వం కూడా అమల్లోకి తెచ్చిందన్నారు.

అది ఒకప్పటి విధానం...

మిషన్ భగీరథ (Mission Bhagiratha) స్ఫూర్తితో కేంద్రం జల్​ జీవన్ (Jal Jeevan)... పరిశ్రమల అనుమతుల కోసం తెచ్చిన సింగిల్ విండో విధానం తరహాలో ఇన్వెస్ట్ ఇండియా తీసుకొచ్చిందని కేటీఆర్ తెలిపారు. బెంగాల్ ఏం చేస్తుందో.. రేపు కేంద్రం అదే చేస్తుందనే విధానం ఒకప్పుడు దేశంలో ఉండేదని... ఇప్పుడు తెలంగాణలో ఇవాళ ఏం జరిగేది.. రేపు దేశమంతటా ఆచరించక తప్పదనే పరిస్థితి వచ్చిందని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో వచ్చిన గుణాత్మక మార్పు దేశమంతటికీ మేలు చేస్తోందన్నారు. ఈనెల 25న జరగనున్న హైటెక్స్​లో జరగనున్న తెరాస ప్లీనరీ ఏర్పాట్లను కేటీఆర్ పరిశీలించారు.

కమిటీల ప్రకటన...

తెరాస ప్లీనరీ (TRS Plenary) కోసం పార్టీ నేతలతో పలు కమిటీలను కేటీఆర్ (Ktr) ప్రకటించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మేయర్ గద్వాల విజయలక్ష్మి నేతృత్వంలో ఆహ్వాన కమిటీ... ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, టీఎస్ఐసీ ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు, పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్​లతో సభా వేదిక ప్రాంగణ కమిటీని నియమించారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు ప్రతినిధుల నమోదు, వాలంటీర్ల కమిటీ.. ఎమ్మెల్యే కేపీ వివేక్, పార్టీ నాయకుడు బండి రమేశ్​కు పార్కింగ్ కమిటీ.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు భోజనాల కమిటీ బాధ్యతలు అప్పగించారు. మాజీ స్పీకర్ మధుసూదనచారి, సీనియర్ నేత పర్యాద కృష్ణమూర్తి తీర్మాన కమిటీకి.. ఎమ్మెల్సీ భానుప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్​కు మీడియా బాధ్యతలు అప్పగించారు. ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్ నగర మంతా విద్యుత్, గులాబీ అలంకరణల బాధ్యతను గ్రేటర్ హైదరాబాద్ మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యత అప్పగించారు.

త్వరలో పేరు...

తెరాస ప్లీనరీ (TRS Plenary) ప్రాంగణానికి త్వరలో పేరు ఖరారు చేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఆహ్వానం ఉన్న పార్టీ ప్రతినిధులు మాత్రమే ప్లీనరీకి హాజరు కావాలని కోరారు. పార్కింగ్, ట్రాఫిక్, పారిశుద్ధ్య నిర్వహణపై నేతలు, అధికారులతో కేటీఆర్ చర్చించారు.

ఇదీ చూడండి: KTR: నవంబరు 15న తెరాస విజయగర్జన: కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details