జానారెడ్డి లాంటి సీనియర్ రాజకీయ నాయకులు కూడా అసత్యాలను వల్లె వేసేందుకే మొగ్గు చూపడం బాధాకరమన్నారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.
అధికారంలోకి వస్తే ఉద్యోగాలు ఇస్తామని తెరాస చెప్పినట్టు జానారెడ్డి.. ఈరోజు మీడియాతో అన్నారు. అవును ముమ్మాటికి జానారెడ్డి చెప్పింది నిజమే. ఇచ్చినమాట ప్రకారం మేం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యువతకు ఉద్యోగాలు కల్పిస్తూనే ఉన్నాం.
-- కేటీఆర్, మంత్రి
తమ పదేళ్ల హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో త్వరలో చెప్తామన్న జానారెడ్డి... అందులో తెలంగాణ యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో కూడా చెప్పాలని లేఖలో కేటీఆర్ కోరారు. జానారెడ్డి లాంటి సీనియర్ నాయకులతో పాటు ప్రతిపక్షాలు మీడియా ముఖంగా అవాస్తవాలు మాట్లాడుతున్నాయన్నారు. ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని ఎండగట్టేలా తెరాస ప్రభుత్వం భర్తీ చేసిన లక్షా 32 వేల 899 ఉద్యోగాల వివరాలను అంకెలతో సహా అందిస్తున్నానని కేటీఆర్ వివరించారు.
సంబంధిత శాఖల వారీగా భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలు
క్రమసంఖ్య | శాఖ | భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య |
1. | తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ | 30,594 |
2. | తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ | 31,972 |
3. | తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు | 3,623 |
4. | ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ- హైదరాబాద్ | 179 |
5. | శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ- హైదరాబాద్ | 80 |
6. | డైరెక్టర్, మైనార్టీస్ వెల్ఫేర్ | 66 |
7. | జూనియర్ పంచాయతీ సెక్రెటరీస్ | 9,355 |
8. | డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయూశ్ | 171 |
9. | టీఎస్ జెన్కో | 856 |
10. | టీఎస్ ఎన్పీడీసీఎల్ | 164 |
11. | టీఎస్ ఎస్పీడీసీఎల్ | 201 |
12. | టీఎస్ ట్రాన్స్కో | 206 |
13. | టీఎస్ ఆర్టీసీ | 4,768 |
14. | సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ | 12,500 |
15. | జెన్కో, ట్రాన్స్కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ | 6,648 |
16. | విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ | 22,637 |
17. | హైదరాబాద్ జలమండలి | 807 |
18. | తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ | 243 |
19. | డీసీసీబీలు | 1,571 |
20. | భర్తీ ప్రక్రియ తుదిదశలో ఉన్న ఉద్యోగాలు | 6,258 |
మొత్తం ఉద్యోగాల సంఖ్య | 1,32,899 |