తెలంగాణ

telangana

ETV Bharat / state

TRS Plenary Live Updates: మోదీ ఆటలు ఇకపై కొనసాగవని హెచ్చరిస్తున్నా: సీఎం కేసీఆర్ - TRS Plenary 2022 Live Updates

TRS PARTYS 21ST PLENARY MEETING LIVE UPDATES
TRS PARTYS 21ST PLENARY MEETING LIVE UPDATES

By

Published : Apr 27, 2022, 10:50 AM IST

Updated : Apr 27, 2022, 9:05 PM IST

21:05 April 27

  • ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేసిన పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు: కేటీఆర్‌
  • ప్రతి గ్రామం, వార్డు, బస్తీల్లో పార్టీ జెండాను ఎగురవేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు: కేటీఆర్‌
  • కేసీఆర్‌ దిశానిర్దేశంతో పార్టీని ముందుకు తీసుకుపోవాలని విజ్ఞప్తి: కేటీఆర్‌
  • ప్లీనరీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి పార్టీ తరపున ధన్యవాదాలు: కేటీఆర్‌

20:10 April 27

8 ఏళ్ల పాలనలో ప్రధాని మోదీ దేశానికి ఏంచేశారు: కేసీఆర్

  • దేశంలో ఏ పరిస్థితి చూసినా బాగాలేదు: కేసీఆర్
  • దేశానికి ప్రత్యామ్నాయ ప్రజల అజెండా రావాలిముఖ్యమంత్రులతో ప్రధాని ఈరోజు సమావేశం నిర్వహించారు: కేసీఆర్
  • కరోనా మళ్లీ వస్తుందనే పేరుతో నిర్వహించిన నాటకం ఈ సమావేశం: కేసీఆర్
  • కరోనా పేరుతో సమావేశమని రాష్ట్రాలు పన్నులు తగ్గించాలని ప్రధాని అంటారా?: కేసీఆర్
  • కేంద్రం పన్నులు పెంచుతూ...రాష్ట్రాలను పన్నులు తగ్గించమని ఏ నోటితో అంటారు: కేసీఆర్
  • కేంద్రం పెట్రోలు, డీజిల్‌ ధరలు పెంచుతుంది: కేసీఆర్
  • దేశ ఆర్థిక వ్యవస్థ, యువతకు ఉద్యోగాల గురించి భాజపా ఆలోచించదా?: సీఎం కేసీఆర్
  • విద్వేషాలు, ఉద్వేగాలు రెచ్చగొట్టి రాజకీయా ప్రయోజనాలు నెరవేర్చకుంటోంది: సీఎం కేసీఆర్
  • 8 ఏళ్ల పాలనలో ప్రధాని మోదీ దేశానికి ఏంచేశారు: సీఎం కేసీఆర్‌ : సీఎం కేసీఆర్
  • సాగు, విద్యుత్‌, విద్య, గృహాలు ఏ రంగంలోనైనా ఒక్క మంచి పనైనా జరిగిందా?: సీఎం కేసీఆర్
  • జీడీపీ, ఆర్థిక వ్యవస్థ దారుణంగా క్షీణించింది: సీఎం
  • ద్రవ్యోల్బణం మాత్రం బాగా పెరిగింది: సీఎం కేసీఆర్‌
  • ప్రసంగాల జోరు, అబద్ధాల హోరు తప్ప మోదీ పాలనలో ఏమీ లేదు: కేసీఆర్
  • యువకులను రెచ్చగొట్టి కల్లోలం సృష్టించడమే భాజపా వ్యూహం: కేసీఆర్
  • మోదీ ఆటలు ఇకపై కొనసాగవని హెచ్చరిస్తున్నా: కేసీఆర్
  • ఒక్కసారి విధ్వంసం చెలరేగితే దీర్ఘకాలం నష్టపోవల్సి వస్తుంది: కేసీఆర్
  • రాష్ట్రంలో ఘర్షణలు జరిగితే పెట్టుబడులు, కంపెనీలు రావు: సీఎం
  • మతం గురించి తప్ప.. అభివృద్ధి, సంక్షేమం గురించి భాజపా ఎప్పుడైనా మాట్లాడిందా?


19:44 April 27

  • దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి రావాలి: కేసీఆర్
  • మూసధోరణి రాజకీయ విధానాలు మారాలి: కేసీఆర్
  • పాలసీ తయారీ, అమలులో లోపాలు ఉన్నాయి: కేసీఆర్
  • ఇప్పుడు మనకు కావాల్సింది ఫ్రంట్‌లు...టెంట్‌లు కాదు: కేసీఆర్
  • సాగునీరు సరిపడ దేశంలో ఉన్నప్పటికీ రైతులకు అందవు: కేసీఆర్
  • దేశవ్యాప్తంగా ఆర్థికవేత్తలతో మాట్లాడాం: కేసీఆర్
  • దేశంలో విద్యుత్‌ ఉంది...ప్రజలకు అందదు: కేసీఆర్
  • దేశానికి ప్రత్యామ్నాయ అజెండా కావాలి: కేసీఆర్
  • దేశంలో ఉన్న వనరులు వాడుకునే చిత్తశుద్ధి లేదు: కేసీఆర్
  • జాతీయ రాజకీయలపై దృష్టిసారించాం: కేసీఆర్
  • ప్రకృతి వనరులు, మానవ వనరులు దేశంలో ఉన్నాయి: కేసీఆర్
  • స్థిరచిత్తంతో పనిచేస్తే అమెరికాను మించిన ఆర్థికశక్తిగా భారత్‌ అవతరిస్తుంది: సీఎం
  • జాతీయ రాజకీయాలకు వెళ్లాలంటే ఆర్థిక వనరులు కావాలని కదాని ఒకరు అడిగారు: సీఎం
  • దేశ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు వెళ్తున్నామని పిలుపునిస్తే ఆర్థిక వనరులు సమకూరుతాయి: సీఎం
  • తెరాసకు నిబద్ధత కల్గిన 60లక్షల మంది సభ్యులు ఉన్నారు: సీఎం
  • రూ.కోటి విరాళాలు ఇచ్చే సభ్యులు ఉన్నారు: సీఎం
  • రూ.లక్ష, రూ.వెయ్యి చొప్పున విరాళాలు ఇచ్చే సభ్యులు ఉన్నారు: సీఎం
  • ఒక్కో సభ్యుడు సగటున రూ.వెయ్యి విరాళం ఇచ్చినా రూ.600కోట్లు సమకూరుతాయి: సీఎం
  • రాబోయే శాసనసభ ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో తెరాస గెలుస్తుంది: కేసీఆర్
  • 90పై చిలుకు స్థానాల్లో తెరాస గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయి: కేసీఆర్
  • ధాన్యం కొనుగోలు ప్రక్రియ సక్రమంగా సాగేలా ఎమ్మెల్యేలు చూడాలి: కేసీఆర్
  • తెరాసకు రూ.865కోట్లు నిధులు ఉన్నాయి: కేసీఆర్
  • రూ.వెయ్యి కోట్ల ఆస్తులు ఉన్నాయి: కేసీఆర్

15:42 April 27

  • తెలుగువారి దశాబ్దాల చరిత్రలో ఎంతో మంది రాజకీయ పార్టీలు పెట్టారు: కేటీఆర్‌
  • చరిత్రలో దశాబ్దాల కాలం నిలబడే పార్టీలు నెలకొల్పింది మాత్రం ఎన్టీఆర్‌, కేసీఆర్‌: కేటీఆర్‌
  • ఎన్టీఆర్‌ పార్టీ స్థాపించి హిస్టరీ సృష్టించారు: కేటీఆర్‌
  • కేసీఆర్‌ హిస్టరీతోపాటు జాగ్రఫీని సృష్టించారు: కేటీఆర్‌
  • ప్రతి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటారు: కేటీఆర్‌
  • తెలంగాణలో మాత్రం రాష్ట్రాన్ని సాధించిన నేత ముఖ్యమంత్రిగా ఉన్నారు: కేటీఆర్‌
  • దేశంలో 24 గంటలపాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ: కేటీఆర్‌
  • తెలంగాణ పథకాలు కేంద్రం కాపీ కొడుతుంది: కేటీఆర్‌
  • కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రంలో వ్యవసాయ దిగుమతులు...ఐటీ ఎగుమతులు పెరుగుతున్నాయి: కేటీఆర్‌
  • దేశానికి దార్శనిక నేత కావాలి: కేటీఆర్‌
  • దేశానికి టెలివిజన్‌ నాయకుడు కాదు...విజన్‌ ఉన్న నాయకుడు కావాలి: కేటీఆర్‌
  • జనహితమే ధ్యేయంగా తెలంగాణ దూసుకెళ్తుంది: కేటీఆర్‌
  • దేశానికి అన్నం పెడుతున్న రాష్ట్రం తెలంగాణ: కేటీఆర్‌
  • తెలంగాణలో వసూలు చేసిన పన్నులు భాజపా పాలిత రాష్ట్రాల్లో కూడా ఖర్చు చేస్తున్నారు: కేటీఆర్‌
  • అంతులేని వైఫల్యాల చరిత్ర భాజపాది: కేటీఆర్‌
  • ఎండిన శ్రీరామ్‌సాగర్‌కు జలకళ తెచ్చిన నేత కేసీఆర్‌: కేటీఆర్‌
  • నరేంద్ర మోదీ రైతు విరోధి: కేటీఆర్‌
  • రైతు బంధు పథకం దేశానికి ప్రేరణగా నిలిచింది: కేటీఆర్‌
  • నోట్ల రద్దు అపసవ్య ఆలోచన: కేటీఆర్‌
  • నల్లధనం వెనక్కితెచ్చి ఖాతాల్లో రూ.15లక్షలు వేస్తామని మోదీ చెప్పారు: కేటీఆర్‌
  • జన్‌ధన్‌ ఖాతా తెరవండి...ధన్‌ ధన్‌ రూ.15లక్షలు వేస్తామని చెప్పారు: కేటీఆర్‌
  • వోకల్‌ ఫర్‌ లోకల్‌ అని మోదీ అంటారు: కేటీఆర్‌
  • కాళేశ్వరం ప్రాజెక్ట్‌ లోకల్‌ కాదా?: కేటీఆర్‌
  • మోదీ...కాళేశ్వరం ప్రాజెక్ట్‌ దేశానికి గర్వకారణం కాదా ?: కేటీఆర్‌
  • డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వంతో అభివృద్ధి అనే నినాదం అందుకున్నారు: కేటీఆర్‌
  • అభివృద్ధిమాట దేవుడెరుగు ధరలు మాత్రం డబుల్‌ చేస్తారు: కేటీఆర్‌
  • దేశంలో ప్రజల కష్టాలు డబల్‌ చేశారు
  • ఎల్‌ఐసీని కూడా విక్రయించే ప్రయత్నం చేస్తున్నారు
  • కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలు తొలగిస్తున్నారు
  • భాజపా చేతిలో అధికారం...దేశానికే అంధకారం
  • ప్రపంచంలోనే సిలిండర్‌ ధర అత్యధికంగా ఉన్న దేశం భారత్‌
  • సిలిండర్‌ ధరలో ప్రపంచంలోనే భారత్‌ను నంబర్‌గా మోదీ నిలిపారు


12:55 April 27

  • హైదరాబాద్‌: తెరాస ప్లీనరీ వేదికగా మొత్తం 13 తీర్మానాలు
  • మొదటి తీర్మానాన్ని ప్రతిపాదించిన వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
  • యాసంగి వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొంటున్నందుకు అభినందన తీర్మానం: మంత్రి నిరంజన్‌రెడ్డి
  • వ్యవసాయాన్ని పండుగ చేసుకునే సందర్భాన్ని ఇవాళ సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించారు: మంత్రి నిరంజన్‌రెడ్డి
  • భాజపా హయాంలో దేశంలో వచ్చిన గుణాత్మకమైన మార్పులేవీ లేవు:మంత్రి నిరంజన్‌రెడ్డి

12:54 April 27

  • గవర్నర్ల వ్యవస్థతో మహారాష్ట్ర, కేరళ, బంగాల్‌లో పంచాయితీ:: కేసీఆర్ కేసీఆర్
  • గవర్నర్ల వ్యవస్థ పెడ ధోరణి, వింత ధోరణితో వ్యవహరిస్తుంది: కేసీఆర్
  • పెద్దలు, పూజ్యులు, స్వర్గీయ ఎన్టీఆర్‌ పార్టీ ఏర్పాటు చేశారు: కేసీఆర్
  • నిష్కల్మశమైన మనసుతో ప్రజలకు మంచి చేయాలని పార్టీ పెట్టారు: కేసీఆర్
  • ఎన్టీఆర్‌ ఏర్పాటు చేసిన పార్టీలో యువకులుగా మేము అందరం పనిచేశాం: కేసీఆర్
  • ఎలాంటి కిరికిరి లేకుండా 200 మంది ఎమ్మెల్యేలతో ఎన్టీఆర్‌ అధికారంలోకి వచ్చారు: కేసీఆర్
  • ప్రజలకు ఇచ్చిన హామీలు ఆచరించారు: కేసీఆర్
  • దుర్మార్గమైన గవర్నర్ల వ్యవస్థను ఎన్టీఆర్‌పై వినియోగించారు: కేసీఆర్
  • స్వచ్ఛమైన పరిపాలన చేస్తున్న ఎన్టీఆర్‌ను పదవి నుంచి తొలగించా: కేసీఆర్రు
  • కుటిలంగా, దుర్మార్గంగా ఎన్టీఆర్‌ పదవి నుంచి తొలగిస్తే ఏం జరిగిందో అందరం చూశాం: కేసీఆర్
  • ఆరోజు హైదారబాద్‌లో జరిగిన చరిత్ర చెబుతున్నాను: కేసీఆర్
  • మా అంతటి సిపాయిలు లేరని భావించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మెడలు వంచారు: కేసీఆర్
  • తెలుగు రాష్ట్రాల ప్రజలు కాంగ్రెస్‌ మెడలు వంచి ఎన్టీఆర్‌కు పదవి ఇచ్చేలా చేశారు: కేసీఆర్

12:54 April 27

  • ఆరేడేళ్లలో భారత సమాజానికే తెలంగాణ ఎస్సీ సమాజం ఆదర్శంగా నిలవబోతోంది: కేసీఆర్
  • గాంధీనే దూషణలు చేసే స్థితికి దేశం చేరుకుంటోంది: కేసీఆర్
  • దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి జాతిపితగా ఎదిగిన వ్యక్తికి ఇదా గౌరవం: కేసీఆర్
  • దేశంలో మతవిద్వేషం మంచిదా? ఇది ఎక్కడికి దారితీస్తుంది?: కేసీఆర్
  • రాజకీయ స్వార్థం కోసం విధ్వంసం చేయడం చాలా తేలిక: కేసీఆర్
  • బెంగళూరు సిలికాన్‌ వ్యాలీ ఆఫ్‌ ఇండియా: కేసీఆర్
  • బెంగళూరులో 30 లక్షల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు: కేసీఆర్
  • బెంగళూరులో పరోక్షంగా మరో 30లక్షల మందికి ఉపాధి: కేసీఆర్
  • ఈరోజు బెంగళూరులో హిజాబ్‌ వంటి అంశాలు తెరపైకి తెచ్చారు: కేసీఆర్
  • దేశాన్ని అన్ని రంగాల్లో నాశనం చేశారు: కేసీఆర్
  • దేశాన్ని అన్ని రంగాల్లో ఎన్డీఏ నాశనం చేసింది: కేసీఆర్
  • గత ప్రభుత్వమే బాగుందని నేడు మాట్లాడుకుంటున్నారు: కేసీఆర్
  • రాజకీయ సందర్భం వస్తే విద్వేషాలు రెచ్చగొడుతున్నారు: కేసీఆర్
  • ఐటీ రంగంంలో బెంగళూరు తర్వాత స్థానంలో హైదరాబాద్‌ ఉంది: కేసీఆర్
  • హైదరాబాద్‌కు ఏడేళ్లలో 2 లక్షల 30వేల పెట్టుబడులు వచ్చాయి: కేసీఆర్
  • ఏడేళ్లలో హైదరాబాద్‌లో 20 వేల పరిశ్రమలు నెలకొల్పారు: కేసీఆర్
  • ఏడేళ్లలో రాష్ట్రంలో 15 లక్షల మంది ఉద్యోగాలు పొందారు: కేసీఆర్


12:25 April 27

రాజకీయ స్వార్థం కోసం విధ్వంసం చేయడం చాలా తేలిక: కేసీఆర్

  • ఆరేడేళ్లలో భారత సమాజానికే తెలంగాణ ఎస్సీ సమాజం ఆదర్శంగా నిలవబోతోంది: కేసీఆర్
  • గాంధీనే దూషణలు చేసే స్థితికి దేశం చేరుకుంటోంది: కేసీఆర్
  • దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి జాతిపితగా ఎదిగిన వ్యక్తికి ఇదా గౌరవం : కేసీఆర్
  • దేశంలో మతవిద్వేషం మంచిదా? ఇది ఎక్కడికి దారితీస్తుంది?: కేసీఆర్
  • రాజకీయ స్వార్థం కోసం విధ్వంసం చేయడం చాలా తేలిక: కేసీఆర్

12:15 April 27

  • 2000లో నేను తెలంగాణ గురించి మాట్లాడితే తిన్నది అరగట్లేదా అన్నారు: కేసీఆర్
  • నేను తల్లిదండ్రులు, భగవంతుడికి దండం పెట్టి అడుగు ముందుకేశా: కేసీఆర్
  • ఈ 20 ఏళ్లలో మన తెలంగాణ ఏ పరిస్థితుల్లో ఉందో చూడండి: కేసీఆర్
  • 11 రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వలస వచ్చి ఉపాధి పొందుతున్నారు: కేసీఆర్
  • కరోనా సమయంలో కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు: కేసీఆర్
  • భారత్‌ వద్ద తగినంత ఆర్థిక వనరులు ఉన్నాయి : కేసీఆర్
  • అభివృద్ధి చేయాలనే సంకల్పం, చిత్తశుద్ధి ఉంటే జరిగితీరుతుంది: కేసీఆర్
  • దేశం బాగు కోసం మన రాష్ట్రం నుంచి అడుగులు పడితే మనకే గర్వకారణం: కేసీఆర్
  • దేశ గతి, స్థితి మార్చడానికి కొత్త అజెండా: కేసీఆర్
  • దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ అజెండా కావాలి: కేసీఆర్
    నూతన వ్యవసాయ, పారిశ్రామిక, ఆర్థిక విధానం కోసం వేదికలు రావాలి: కేసీఆర్
  • సరైన ప్రగతి పంథాలో నడిపించేందుకు కొత్త సిద్ధాంతం రావాలి: కేసీఆర్
  • దేశానికి గర్వకారణంగా నిలిచే కొత్త అజెండా, సిద్ధాంతం : కేసీఆర్
  • హైదరాబాద్‌ వేదికగా ఆ అజెండా వస్తే అది మనకే గర్వకారణం : కేసీఆర్
  • భారత రాష్ట్ర సమితి రావాలనే ప్రతిపాదనలు కూడా వస్తున్నాయి: కేసీఆర్
  • కొత్త రాజకీయ అజెండా కోసం దారులు వెతకాలి: కేసీఆర్

12:05 April 27

దేశానికి కావాల్సింది రాజకీయ ఫ్రంట్‌లు కాదు

  • దేశంలో అందరం ఒక్కటి కావాలని వామపక్ష నాయకులు అన్నారు : కేసీఆర్
  • భాజపాకు వ్యతిరేకంగా ఒక్కటి కావాలని అన్నారు.. నేను వ్యతిరేకించా: కేసీఆర్
  • దేశ ప్రజలను ఒక్కటి చేయాలని వారితో చెప్పా: కేసీఆర్
  • దేశంలో మౌలిక వసతులు, అభివృద్ధిని పూర్తిస్థాయిలో కల్పించాలి : కేసీఆర్
  • 44 కోట్ల పంటలు పండే భూములున్న దేశంలో ఆకలి కేకలా?: కేసీఆర్
  • మన తలసరి ఆదాయంలో పావు వంతు కూడా లేని ఒక సీఎం.. మన వద్దకొచ్చి మాట్లాడుతున్నారు: కేసీఆర్
  • రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు రేషన్ బియ్యం ఇస్తున్నామని చెప్పారు: కేసీఆర్
  • రేషన్‌ బియ్యం ఇస్తున్నారని మీకు ఓటేయాలా?: కేసీఆర్
  • ఇదేనా అభివృద్ధి, ఇలాగేనా పాలించేది?: కేసీఆర్
  • రూ.77 వేల కోట్ల తలసరి ఆదాయమున్న రాష్ట్ర సీఎం.. మనకొచ్చి నీతులు చెప్తున్నారు: కేసీఆర్
  • ఈ దేశం ఏ లక్ష్యం వైపు పయనిస్తోంది?: కేసీఆర్
  • దేశం ఒక లక్ష్యం దిశగా సామూహిక పయనం చేయాలి: కేసీఆర్
  • లక్ష్యం లేని దిశలో మనం చీకట్లో బాణం సంధిస్తున్నాం
  • క్రమశిక్షణతో, పట్టుదలతో లక్ష్యాలను సాధించాలి: కేసీఆర్
  • సాగుకు అందుబాటులో ఉండే భూమి పరంగా చైనా కంటే భారత్‌ ముందుంది: కేసీఆర్
  • అయినా భారత్‌ను మించి ఇవాళ చైనా ఏస్థాయిలో ఉంది: కేసీఆర్
  • మన రాష్ట్రంలోని ఒక జిల్లా అంత లేని ఇజ్రాయెల్‌ నుంచి ఆయుధాలు కొంటున్నాం: కేసీఆర్
  • సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం, అపారమైన జలసంపద, ఖనిజ సంపద మనకున్నాయి: కేసీఆర్
  • దేశానికి కావాల్సింది రాజకీయ ఫ్రంట్‌లు కాదు : కేసీఆర్

12:04 April 27

  • రెండో సారి గెలిచాక రాష్ట్రాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకెళ్లేలా పాలన: కేసీఆర్
  • 85 శాతం మొక్కలు బతకకపోతే తెరాస వారైనా సర్పంచ్‌ పదవి పోతుంది : కేసీఆర్
  • పల్లెప్రగతి పేరిట ఏటా రెండు, మూడు సార్లు డ్రైవ్‌ నిర్వహిస్తున్నాం: కేసీఆర్
  • అందువల్లే పల్లె ప్రగతిలో 1 నుంచి 10 వరకు అవార్డులు వచ్చాయి: కేసీఆర్
  • కొన్ని వందల అవార్డులు కేంద్ర ప్రభుత్వమే మన రాష్ట్రానికి ఇచ్చింది: కేసీఆర్

11:49 April 27

  • స్వాతంత్య్ర ఫలాలు లభించాల్సిన పద్ధతిలో దేశం ప్రజలకు లభించలేదు: కేసీఆర్
  • అనవసరమైన పెడధోరణులు సమాజంలో పెరుగుతున్నాయి: కేసీఆర్
  • ఇలాంటి దురాచారాలు, దురాగతాలు సమాజంలో అవసరం లేదు: కేసీఆర్
  • దేశం ఉనికికే ముప్పు ఏర్పడే స్థాయికి ఈ పెడధోరణులు పెరుగుతున్నాయి: కేసీఆర్
  • దేశ పరిరక్షణ కోసం మనం కృషిచేయాల్సిన అవసరముంది: కేసీఆర్
  • చదువుకున్న వాళ్లకు కూడా కొన్ని అంశాలపై స్పష్టమైన అవగాహన లేదు: కేసీఆర్
  • గుజరాత్‌లోనూ విద్యుత్‌ కొరతతో పంటలు ఎండిపోతున్నాయి: కేసీఆర్
  • కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ వంటి అనేక రాష్ట్రాల్లో విద్యుత్‌ కోతలున్నాయి: కేసీఆర్
  • ప్రకటిత, అప్రకటిత కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు: కేసీఆర్
  • కానీ, తెలంగాణలో నిరంతర విద్యుత్‌తో వెలుగుజిలుగులు కనిపిస్తున్నాయి: కేసీఆర్
  • దేశంలో సజీవంగా ప్రవహించే నదుల్లో ఉండే నీటి లభ్యత 65 వేల టీఎంసీలు : కేసీఆర్
  • మరో 4, 5 టీఎంసీల లెక్కలు తేలాల్సి ఉంది: కేసీఆర్
  • 65 టీఎంసీలకు గాను కేవలం 30 వేల టీఎంసీల లోపే దేశం వాడుకుంటోంది: కేసీఆర్
  • దేశంలోని రాష్ట్రాల్లో నీటియుద్ధాలు జరుగుతున్నాయి: కేసీఆర్
  • కావేరి జలాల కోసం తమిళనాడు- కర్ణాటక మధ్య యుద్ధం: కేసీఆర్
  • సింధు- సట్లేజ్‌ నదీ జలాల కోసం పంజాబ్‌- హరియాణ యుద్ధం: కేసీఆర్
  • నీటి కోసం యుద్ధాలు చేసుకోవాల్సిన దౌర్భాగ్యం ఎందుకు ఏర్పడింది?: కేసీఆర్
  • తాగునీరు, సాగునీరు లేక దేశం ఎందుకు అల్లాడుతోంది?: కేసీఆర్
  • ప్రపంచంలోకెల్లా అత్యధిక యువశక్తి భారత్‌లోనే ఉంది: కేసీఆర్
  • భారత పౌరులు విదేశాల్లో తమ శక్తిసామర్థ్యాలను ధారపోస్తున్నారు: కేసీఆర్
  • మన వద్ద శక్తీసామర్థ్యాలు లేకనా ఈ పరిస్థితులు?: కేసీఆర్
  • కనీసం మట్టి, మంచినీళ్లు కూడా సరిగా లేని సింగపూర్‌లో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది?: కేసీఆర్
  • మన వద్ద అన్నీ ఉన్నా... ఎందుకు ఈ పరిస్థితి?: కేసీఆర్

11:34 April 27

  • అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడి రాష్ట్రాన్ని ప్రగతిపథంలో తీసుకెళ్తున్న పార్టీ తెరాస: కేసీఆర్
  • తెరాస పార్టీకి తెలంగాణ కంచుకోట: కేసీఆర్
  • తెరాస పార్టీ తెలంగాణ ప్రజల ఆస్తి : కేసీఆర్
  • రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే కాపలాదారు తెరాస: కేసీఆర్
  • రాష్ట్ర సాధనలో అనేక ఒడుదొడుకులు, అవమానాలు ఎదుర్కొన్నాం: కేసీఆర్
  • ఎన్నో ఛీత్కారాలను ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించుకున్నాం: కేసీఆర్
  • దేశానికి రోల్‌ మోడల్‌గా రాష్ట్రంలో పాలన సాగిస్తున్నాం: కేసీఆర్
  • కేంద్రం, పలు సంస్థల నుంచి వస్తున్న అవార్డులే రాష్ట్ర ప్రగతికి చిహ్నం: కేసీఆర్
  • 1 నుంచి 10 వరకు ఉత్తమమైన గ్రామాలు తెలంగాణవే అని కేంద్రం ప్రకటించింది: కేసీఆర్
  • అవినీతి రహితంగా, చిత్తశుద్ధితో ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నాం: కేసీఆర్
  • పాలమూరు- రంగారెడ్డిని పూర్తిచేసుకుంటే మరింత సస్యశ్యామలం : కేసీఆర్
  • అంకితభావంతో పనిచేసినందుకే రాష్ట్రంలో నేడు విద్యుత్‌ సమస్య లేదు: కేసీఆర్
  • ఎందరో మహానుభావులు, పార్టీ శ్రేణుల కష్టమే తెరాసకు ఈ విజయాలు: కేసీఆర్
  • కర్ణాటకలో అవినీతికి పాల్పడి ఒకరు మంత్రి పదవి కోల్పోయారు: కేసీఆర్
  • కర్ణాటక తరహా పరిస్థితి తెలంగాణలో లేదు: కేసీఆర్
  • ధరణి ద్వారా రైతులు, భూ యజమానుల సమస్య పూర్తిగా తీరింది: కేసీఆర్
  • గొప్పలు చెప్పుకొని పొంగిపోవడం లేదు.. వాస్తవాలు మాట్లాడుకుంటున్నాం: కేసీఆర్
  • పలు పెద్ద రాష్ట్రాలను అధిగమించి మన తలసరి ఆదాయం రూ.2,78,000: కేసీఆర్
  • జీరో ఫ్లోరైడ్‌ రాష్ట్రంగా తెలంగాణను నిలిపాం: కేసీఆర్
  • తెలంగాణ తలసరి ఆదాయాన్ని రెట్టింపు కంటే ఎక్కువగా చేసుకున్నాం: కేసీఆర్
  • ఒకప్పుడు 3 ప్రభుత్వ వైద్యశాలలుంటే ఇప్పుడు 33 వైద్యకళాశాలలు ఏర్పాటు చేసుకున్నాం : కేసీఆర్
  • గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ కూడా ఇచ్చాం: కేసీఆర్
  • ఉద్యోగ సాధన కోసం నిరుద్యోగులంతా తలమునకలుగా కష్టపడుతున్నారు: కేసీఆర్

11:34 April 27

తెరాస జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌

  • హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో తెరాస ఆవిర్భావ వేడుకలు
  • ప్లీనరీ వేదికపై తెరాస జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌
  • ప్లీనరీ వేదికపై అమరవీరుల స్తూపానికి సీఎం కేసీఆర్‌ నివాళులు
  • ప్లీనరీలో పాల్గొన్న సుమారు 3 వేల మందికి పైగా తెరాస ప్రతినిధులు
  • తెరాస నేత కె.కేశవరావు స్వాగత ఉపన్యాసంతో కార్యక్రమం ప్రారంభం
  • ప్లీనరీ సందర్భంగా ఎల్ఈడీ స్క్రీన్లతో భారీ వేదిక ఏర్పాటు
  • తెరాస ప్లీనరీలో 13 అంశాలపై చర్చలు, తీర్మానాలు
  • జాతీయ రాజకీయాలే కేంద్రబిందువుగా ప్లీనరీ జరగబోతున్నట్లు సమాచారం
  • ప్రత్యామ్నాయ కూటమిపై కేసీఆర్‌ స్పష్టత ఇవ్వొచ్చని భావిస్తున్న పార్టీ శ్రేణులు
  • జాతీయ పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ స్పష్టత ఇవ్వొచ్చని భావిస్తున్న పార్టీ శ్రేణులు
  • అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయనున్నట్లు సమాచారం
  • సాయంత్రం 5 గంటలకు ముగియనున్న తెరాస ప్లీనరీ

11:08 April 27

తెరాస ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్న సీఎం కేసిఆర్

  • తెరాస ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్న సీఎం కేసిఆర్

11:08 April 27

  • మాదాపూర్‌ హెచ్ఐసీసీ ప్రాంగణం వద్ద ఉద్రిక్తత
  • ప్రాంగణం లోపలికి వెళ్లేందుకు తెరాస కార్యకర్తల యత్నం
  • పాసులు లేవని అడ్డుకోవడంతో తెరాస కార్యకర్తల వాగ్వాదం
  • హైదరాబాద్‌: పోలీసులు, తెరాస కార్యకర్తల మధ్య తోపులాట

11:03 April 27

జాతీయ రాజకీయాల్లో తెరాస పాత్రపై తీర్మానాన్ని ప్రతిపాదించనున్న కేటీఆర్

  • తెరాస ప్లీనరీలో తీర్మానం ప్రతిపాదించనున్న మంత్రి కేటీఆర్‌
  • జాతీయ రాజకీయాల్లో తెరాస పాత్రపై తీర్మానాన్ని ప్రతిపాదించనున్న కేటీఆర్

10:59 April 27

ప్రగతిభవన్‌ నుంచి ప్లీనరీ కార్యక్రమానికి బయల్దేరిన సీఎం కేసీఆర్‌

  • ప్రగతిభవన్‌ నుంచి ప్లీనరీ కార్యక్రమానికి బయల్దేరిన సీఎం కేసీఆర్‌
  • కాసేపట్లో హెచ్‌ఐసీసీ ప్రాంగణానికి చేరుకోనున్న సీఎం కేసీఆర్‌

10:49 April 27

హెచ్‌ఐసీసీ ప్రాంగణానికి చేరుకున్న మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌, ఎమ్మెల్సీ కవిత

  • హెచ్‌ఐసీసీ ప్రాంగణానికి చేరుకున్న మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌, ఎమ్మెల్సీ కవిత
  • హెచ్‌ఐసీసీ ప్రాంగణానికి చేరుకుంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలు
  • కాసేపట్లో ప్లీనరీ వేదికకు రానున్న మఖ్యమంత్రి కేసీఆర్

10:06 April 27

కాసేపట్లో ప్రారంభంకానున్న తెరాస ప్లీనరీ

  • హైదరాబాద్‌: కాసేపట్లో ప్రారంభంకానున్న తెరాస ప్లీనరీ
  • హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో తెరాస ఆవిర్భావ వేడుకలు
  • ప్లీనరీలో పాల్గొననున్న 3 వేల మందికి పైగా పార్టీ ప్రతినిధులు
  • తెరాస ప్లీనరీకి వచ్చేవారికి ఇప్పటికే ప్రత్యేక పాస్‌లు జారీ
  • ప్లీనరీ సందర్భంగా ఎల్ఈడీ స్క్రీన్లతో భారీ వేదిక ఏర్పాటు
  • ఉదయం 11 వరకు తెరాస ప్రతినిధుల నమోదు కార్యక్రమం
  • ఉదయం 11.05 గం.కు అమరవీరులకు నివాళులర్పించనున్న కేసీఆర్‌
  • అనంతరం తెరాస జెండా ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్‌
  • కేసీఆర్‌ స్వాగత ఉపన్యాసంతో కార్యక్రమం ప్రారంభం
  • తెరాస ప్లీనరీలో 11 అంశాలపై చర్చలు, తీర్మానాలు
  • జాతీయ రాజకీయాలే కేంద్రబిందువుగా ప్లీనరీ జరగబోతున్నట్లు సమాచారం
  • ప్రత్యామ్నాయ కూటమిపై కేసీఆర్‌ స్పష్టత ఇవ్వొచ్చని భావిస్తున్న పార్టీ శ్రేణులు
  • జాతీయ పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ స్పష్టత ఇవ్వొచ్చని భావిస్తున్న పార్టీ శ్రేణులు
  • అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయనున్నట్లు సమాచారం
  • సాయంత్రం 5 గంటలకు ముగియనున్న తెరాస ప్లీనరీ

08:30 April 27

రాష్ట్రవ్యాప్తంగా తెరాస 21వ ఆవిర్భావ వేడుకలు

  • తెరాస ప్లీనరీ సందర్భంగా గులాబీమయంగా హైదరాబాద్
  • హైదరాబాద్‌లోని కూడళ్లలో కేసీఆర్, కేటీఆర్ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు
  • హైటెక్స్‌ పరిసరాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు
  • తెరాస ప్లీనరీ సందర్భంగా 2500 మంది పోలీసులతో బందోబస్తు
  • తెరాస ప్లీనరీ జరిగే ప్రాంతంలో 200 సీసీ కెమెరాలతో నిఘా
  • సీసీటీవీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం
  • ప్లీనరీకి వచ్చే రోడ్లలోని సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ

08:24 April 27

TRS Plenary 2022 Live Updates

  • నేడు రాష్ట్రవ్యాప్తంగా తెరాస 21వ ఆవిర్భావ వేడుకలు
  • హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో తెరాస ఆవిర్భావ వేడుకలు
  • పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహణకు తెరాస ఏర్పాట్లు
  • వేడుకలకు హాజరుకానున్న 3 వేల మందికి పైగా పార్టీ ప్రతినిధులు
  • తెరాస ప్లీనరీకి వచ్చేవారికి ఇప్పటికే ప్రత్యేక పాస్‌లు జారీ
  • ప్లీనరీ సందర్భంగా ఎల్ఈడీ స్క్రీన్లతో భారీ వేదిక ఏర్పాటు
  • ఉదయం 10 నుంచి 11 వరకు తెరాస ప్రతినిధుల నమోదు కార్యక్రమం
  • ఉదయం 11.05 గం.కు అమరవీరులకు నివాళులర్పించనున్న కేసీఆర్‌
  • అనంతరం తెరాస జెండా ఆవిష్కరించనున్న కేసీఆర్‌
  • కేసీఆర్‌ స్వాగత ఉపన్యాసంతో కార్యక్రమం ప్రారంభం
  • తెరాస ప్లీనరీలో 11 అంశాలపై చర్చలు, తీర్మానాలు
  • జాతీయ రాజకీయాలే కేంద్రబిందువుగా ప్లీనరీ జరగబోతున్నట్లు సమాచారం
  • ప్రత్యామ్నాయ కూటమిపై కేసీఆర్‌ స్పష్టత ఇవ్వొచ్చని భావిస్తున్న పార్టీ శ్రేణులు
  • జాతీయ పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ స్పష్టత ఇవ్వొచ్చని భావిస్తున్న పార్టీ శ్రేణులు
  • అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయనున్నట్లు సమాచారం
  • సాయంత్రం 5 గంటలకు ముగియనున్న తెరాస ప్లీనరీ
Last Updated : Apr 27, 2022, 9:05 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details