వరంగల్, ఖమ్మం నగర పాలక సంస్థలతో పాటు సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు పురపాలికలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల వార్డులకు ఉపఎన్నికలను నిర్వహించనున్నారు. ఎన్నికల ఇన్‌ఛార్జిగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు వ్యవహరిస్తుండగా.. స్థానిక నేతలు పర్యవేక్షించనున్నారు. ఆదివారం నుంచే పూర్తి స్థాయిలో ప్రచారం చేపట్టాలని అధిష్ఠానం నిర్దేశించింది.
ఎక్కడివారక్కడే..
స్థానిక ఎన్నికలైనందున ఆయా జిల్లాల మంత్రుల ఆధ్వర్యంలోనే పార్టీ శ్రేణులు పనిచేయాలని అధిష్ఠానం నిర్ణయించింది. వరంగల్‌కు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, చీఫ్ విప్ వినయ్‌భాస్కర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యేలు.., ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్.. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు, సిద్దిపేటకు మంత్రి హరీశ్‌రావు, జడ్చర్ల, కొత్తూరు పురపాలికలకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్, అచ్చంపేటకు మంత్రి నిరంజన్‌రెడ్డి, నకిరేకల్‌కు మంత్రి జగదీశ్‌రెడ్డిల పర్యవేక్షణ బాధ్యతలు చేపడతారు.