ఎమ్మెల్సీ ఎలక్షన్లు దగ్గరికి రావడంతో నగరంలోని తెరాస అభ్యర్థుల్లో ఉత్సాహం ఊపందుకుంది. ఎమ్మెల్సీ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈరోజు కార్వాన్, గుడిమల్కాపూర్ నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాలను ఆవిష్కరించారు. పార్టీ మహిళా కార్యకర్తలు కార్యాలయం ముందు బతుకమ్మ ఆడారు. రాబోయే ఎన్నికల కోసం ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టాలని ప్రభాకర్ సూచించారు. బస్తీలోని యువకులు పార్టీ కండువా వేసుకొని తెరాస తీర్థం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కార్వాన్ తెరాస ఇన్ఛార్జ్ జీవన్ సింగ్, కార్పొరేటర్ మిత్ర కృష్ణ పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలతో తెరాస అభ్యర్థుల్లో ఉత్సాహం - హైదరాబాద్ లో తెరాస కొత్త పార్టీ కార్యాలయాలు
ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడటంతో నగరంలోని తెరాస అభ్యర్థుల్లో ఉత్సాహం నిండింది. ఎమ్మెల్సీ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈరోజు కార్వాన్, గుడిమల్కాపూర్ నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాలను ఆవిష్కరించారు.
ఎమ్మెల్సీ ఎన్నికలతో తెరాస అభ్యర్థుల్లో ఉత్సాహం