తెలంగాణ

telangana

ETV Bharat / state

గుండెపోటుతో తెరాస ప్రమాద బీమా వ్యవహారాల ఇంఛార్జి మృతి - telangana varthalu

తెరాస పార్టీ ప్రమాద బీమా వ్యవహారాల ఇంఛార్జి కావేటి లక్ష్మినారాయణ గుండెపోటుతో మరణించారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్​, మంత్రి కేటీఆర్​, పలువురు మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు.

kaveti died
గుండెపోటుతో తెరాస ప్రమాద బీమా వ్యవహారాల ఇంఛార్జి మృతి

By

Published : Jun 14, 2021, 4:59 PM IST

తెరాస నాయకుడు, పార్టీ సభ్యుల ప్రమాద బీమా వ్యవహారాల ఇంఛార్జి కావేటి లక్ష్మినారాయణ గుండెపోటుతో మరణించారు. కావేటి లక్ష్మినారాయణ మృతి పట్ల ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. కావేటి మరణంతో సేవా తత్పరత, నిబద్ధత కలిగిన నాయకుణ్ణి పార్టీ కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. కావేటి లక్ష్మినారాయణ కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

కావేటి లక్ష్మినారాయణ మృతి పట్ల తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు సంతాపం వ్యక్తం చేశారు. కావేటి మరణం పార్టీకి తీరని లోటు అని అన్నారు. తెరాస పార్టీ బీమా విభాగం బాధ్యుడిగా వందలాది మంది కార్యకర్తల కుటుంబాలకు విశేష సేవలు అందించారని కేటీఆర్ గుర్తుచేశారు. కావేటి లక్ష్మినారాయణ మృతి పట్ల మంత్రులు కొప్పుల ఈశ్వర్, నిరంజన్ రెడ్డి, తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: etela rajender: జె.పి.నడ్డాను కలిసిన ఈటల రాజేందర్

ABOUT THE AUTHOR

...view details