తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బోరబండలో ఘనంగా నిర్వహించారు. పార్టీ ఆవిర్భవించి 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా... జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ తెరాస జెండాను ఆవిష్కరించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెరాస పోరాడిందని అన్నారు.
'రాష్ట్ర సాధన కోసం పోరాడిన పార్టీ తెరాస' - హైదరాబాద్ తాజా వార్తలు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధన కోసం తెరాస పార్టీ పోరాడిందని... జీహెచ్ఎంసీ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ అన్నారు. తెరాస ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బోరబండలో పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు.
బోరబండలో తెరాస పార్టీ ఆవిర్భావ వేడుకలు
కొవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా బోరబండలో వెల్ఫేర్ కమిటీలతో కలిసి పలు కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. బస్తీలలో మూడు రోజుల పాటు ఉచితంగా మాస్కులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. పారిశుద్ధ్య కార్మికులు, ఆరోగ్య కార్యకర్తలు, పోలీసు సిబ్బందికి మాస్కులు అందజేస్తామనిపేర్కొన్నారు.
ఇదీ చదవండి: ధర్మసాగర్లో ఘనంగా తెరాస పార్టీ ఆవిర్భావ వేడుకలు