తెలంగాణ

telangana

ETV Bharat / state

TRS MLC candidates for MLA quota: ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్ల గడువు.. తెరాస నుంచి ఆ ఆరుగురు.. - తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థులు ఖరారయ్యారు. చివరి నిమిషంలో బండా ప్రకాశ్‌, వెంకట్రామిరెడ్డి అవకాశం దక్కించుకున్నారు. నామినేషన్లు గడువు ముగియగా.. అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఆరు స్థానాల్లో ఆరుగురు తెరాస అభ్యర్థులతో పాటు ఇద్దరు శ్రమజీవి పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. రేపు ఎన్నికల నామినేషన్ల పరిశీలన ఉంటుంది.

TRS MLC candidates for MLA quota
TRS MLC candidates for MLA quota

By

Published : Nov 16, 2021, 5:44 PM IST

ఎమ్మెల్యే కోటా తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థులు

ఎమ్మెల్యే కోటా తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారయ్యారు (trs mlc candidates announced). ఆరు స్థానాలకు అభ్యర్థులుగా బండా ప్రకాశ్ (banda prakash) , వెంకట్రామిరెడ్డి (venkatarami reddy), గుత్తా సుఖేందర్‌రెడ్డి , తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, కౌశిక్‌రెడ్డి, కడియం శ్రీహరి పేర్లను అధిష్టానం ప్రకటించింది. ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగియగా.. 8 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. సుదీర్ఘ కసరత్తు అనంతరం అనూహ్యంగా తెరాస అభ్యర్థుల ఎంపికలో మార్పులు చేర్పులు జరిగాయి. ఆకుల లలిత కొనసాగిస్తారనే ప్రచారంతో పాటు మధుసూధనాచారిని మండలికి పంపిస్తారనే ఊహాగానాలు వచ్చాయి. చివరి నిమిషంలో మార్పులు జరిగాయి.

రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్‌ (banda prakash) కు ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. ఆయనకు మంత్రి పదవి ఇవ్వవచ్చనే ప్రచారం జరుగుతోంది. సిద్దిపేట కలెక్టర్‌గా స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన వెంకట్రామిరెడ్డిని పెద్దల సభకు పంపిచాలని తెరాస నిర్ణయించింది. పాడి కౌశిక్‌రెడ్డికి (Paadi Kaushik reddy) గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీకి నామినేట్‌ చేసినా.. ఆ దస్త్రం గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉంది. ఆయన చేసిన సామాజిక సేవ పరిశీలించాలని గవర్నర్‌ ప్రకటించారు. ఈ పరిణామాలతో కౌశిక్‌రెడ్డిని శాసనసభ్యుల కోటాలో మండలికి పంపించాలని గులాబీ అధినేత నిర్ణయించారు.

ఖాళీ అయిన ఆరు స్థానాల్లో ఆ ఇద్దరే మళ్లీ..

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీకి ఆరుస్థానాలు ఖాళీ అయ్యాయి (trs mlc candidates announced). . ఆకుల లలిత, ఫరీదుద్దీన్‌, నేతి విద్యాసాగర్‌, గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, బోడకుంటి వెంకటేశ్వర్లు పదవీ కాలం ముగిసింది. ఆయా స్థానాల్లో కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌రెడ్డిని కొనసాగిస్తూ తెరాస అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. విద్యాసాగర్‌రావును కొనసాగిస్తారనే ప్రచారం జరిగినా ఆయనకు అవకాశం దక్కలేదు. ఆకుల లలితను స్థానిక కోటాలో పెద్దల సభకు పంపిస్తారనే ప్రచారం జరుగుతోంది.

బండ ప్రకాశ్​కు మంత్రి పదవి..!

ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన ఈటల రాజేందర్‌ (etela rajendar) తెరాసను వీడగా.. అతని స్థానంలో బండ ప్రకాశ్‌ (banda prakash)కు ప్రమోషన్‌ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాశ్‌ .. మండలికి వెళ్లనున్నారు. ప్రకాశ్‌కు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉండటం వల్లే రాజ్యసభ నుంచి మండలికి పంపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మధుసూధనాచారి, కవితకు రాజ్యసభ దక్కవచ్చని తెరాస వర్గాలు చెబుతున్నాయి.

ఇదీ చూడండి:TRS MLC candidates for MLA quota : ఎమ్మెల్యే కోటా తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే

ABOUT THE AUTHOR

...view details