trs parliamentary party meeting : ఫిబ్రవరి 1నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా.... రేపు మధ్యాహ్నం తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతిభవన్‌లో భేటీ జరగనుంది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభ, రాజ్యసభల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని సీఎం ఖరారు చేయనున్నారు.
trs parliamentary party meeting: రేపు తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం - తెలంగాణ ప్రధాన వార్తలు
రేపు తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం
12:42 January 29
రేపు తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం
రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేంద్రం నుంచి సాధించాల్సిన పెండింగ్ సమస్యలపై ఎంపీలకు నివేదికలు అందజేయనున్నారు. రాష్ట్ర హక్కులను సాధించుకునేందుకు ఉభయ సభల్లో ఎంపీలు, కేంద్రంపై అనుసరించాల్సిన పోరాట పంథాపైనా కేసీఆర్ సూచనలు, ఆదేశాలు జారీ చేయనున్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి:Schools Reopen in Telangana : విద్యాసంస్థలు తెరిచేందుకే సర్కార్ మొగ్గు
Last Updated : Jan 29, 2022, 1:08 PM IST