తెరాస పార్లమెంటరీ పార్టీ భేటీ.. ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం - TRS Parliamentary Party meeting
13:06 July 16
సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెరాస పార్లమెంటరీ పార్టీ భేటీ
CM KCR Meeting With MPs : ప్రగతిభవన్‌లో తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెరాస లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. ఈ నెల 18 నుంచి జరగనున్న పార్లమెంటు సమావేశాల దృష్ట్యా.. ఉభయసభల్లో తెరాస నేతలు అనుసరించాల్సిన విధివిధానాలపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
లోక్‌సభ, రాజ్యసభల్లో తెరాస ఎంపీలు అవలంభించాల్సిన పలు కీలక అంశాలపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని ఎంపీలకు సూచించారు. తెలంగాణపై వివక్షను ఎత్తిచూపేలా.. పార్లమెంటు వేదికగా కేంద్రప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని.. ధాన్యం కొనుగోళ్లపైనా పోరాడాలని ఎంపీలకు మార్గనిర్దేశం చేశారు.
CM KCR fight against Center : పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో.. కేంద్రంపై పోరాటానికి కలసి రావాలని వివిధ రాష్ట్రాల సీఎంలు,నేతలతో ఇప్పటికే సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. మమతా బెనర్జీ, అర్వింద్ కేజ్రీవాల్, తేజస్వీ యాదవ్, అఖిలేశ్ యాదవ్, శరద్ పవార్‌లతో పలు అంశాలపై చర్చించారు. పార్లమెంటు వేదికగా కేంద్రప్రభుత్వంపై పోరాడదామని సీఎం కేసీఆర్ తెలిపారు. అందుకు నేతలు సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఎంపీలతో కానున్న సీఎం కేసీఆర్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.