తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేంద్రానికి చేతకాకుంటే రాష్ట్రాలకు అధికారం అప్పగించండి'

Trs MP'S on SC Classification: 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన భాజపా.. 8 ఏళ్లుగా తీర్మానాన్ని తొక్కిపెట్టిందని తెరాస లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వరావు ఆరోపించారు. వర్గీకరణ చేయకుండా ఎస్సీలకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రం వైఖరికి నిరసనగా లోక్‌సభ నుంచి తెరాస ఎంపీలు వాకౌట్
కేంద్రం వైఖరికి నిరసనగా లోక్‌సభ నుంచి తెరాస ఎంపీలు వాకౌట్

By

Published : Mar 31, 2022, 1:05 PM IST

Updated : Mar 31, 2022, 1:16 PM IST

Trs MP'S on SC Classification: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చేసి పంపిన ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని.. కేంద్ర ప్రభుత్వం 8 ఏళ్లుగా తొక్కిపెట్టిందని తెరాస లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వరావు ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణపై తేల్చాలంటూ తెరాస ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్‌ తిరస్కరించారని.. అందుకు నిరసనగా సభ నుంచి వాకౌట్‌ చేసినట్లు చెప్పారు. 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని అధికారంలోకి వచ్చిన భాజపా... 8 ఏళ్లుగా అణగారిన వర్గాలను మోసం చేస్తోందని నామ నాగేశ్వరరావు విమర్శించారు.

ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని 8 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం తీర్మానాన్ని తొక్కిపెట్టింది. 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని ఎన్నికల్లో భాజపా హామీ ఇచ్చింది. వర్గీకరణ చేయకుండా ఎస్సీలకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. ఎస్సీ వర్గీకరణ అధికారం కేంద్రం చేతుల్లో ఉంది. కేంద్రానికి చేతకాకుంటే రాష్ట్రాలకు అధికారం అప్పగించండి. ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ అనేక సార్లు లేఖలు రాశారు.ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా మాయమాటలతో కేంద్రం నెట్టుకొస్తోంది. కేంద్రం వైఖరిని ఎస్సీ వర్గాలు గమనించి గుణపాఠం చెప్పాలి. దళిత బంధు తరహాలో కేంద్రం కూడా ఎస్సీలకు పథకం ప్రవేశపెట్టాలి. -నామ నాగేశ్వరరావు, తెరాస లోక్​సభాపక్ష నేత

లోక్‌సభ నుంచి తెరాస ఎంపీలు వాకౌట్

ఇదీ చదవండి:

Last Updated : Mar 31, 2022, 1:16 PM IST

ABOUT THE AUTHOR

...view details