trs mps on bjp, congress: రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదని తెలిపిన తెరాస ఎంపీలు వెంకటేశ్ నేత, మాలోత్ కవిత పేర్కొన్నారు. రాజ్యాంగ రచన సమయంలోనే అంబేడ్కర్ పరిస్థితులను బట్టి సవరణ చేయాలని తెలిపారని ఎంపీలు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా భాజపా, కాంగ్రెస్ చేస్తున్న నిరసన దీక్షలు సరికాదని సూచించారు.
దొంగా దొంగా అంటూ దొంగనే దీక్షకు కూర్చున్నట్టు కనబడుతోంది. బడుగు బలహీన వర్గాల వారికి ఏరకంగా ఈ బడ్జెట్ ఉపయోగపడుతోందో చెప్పాల్సింది పోయి.. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తోన్న రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు భాజపా రాష్ట్ర నాయకులు మద్దతు ప్రకటిస్తున్నారు. రాష్ట్ర ప్రజలపై గాని... రాష్ట్రంపై గాని వీళ్లకు చిత్తశుద్ధి లేదు. -వెంకటేశ్ నేత, పెద్దపల్లి ఎంపీ
బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేసేదే ముఖ్యమంత్రి కేసీఆర్. అతనో లెజెండ్. ఇవాళ దళితబంధు ఎవరికోసం అమలు చేస్తున్నారు. ఇది అంబేడ్కర్ ఆశించినది కాదా..? మిగతావారంతా ఏ దీక్ష చేయాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేస్తుందో వాటి గురించి దీక్ష పెట్టండి. అంతేగాని అనవసరంగా దీనిని రాద్ధాంతం చేసుకుంటూ రాజకీయం చేస్తే అది మీకే నష్టం. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మా ప్రాంతంలో మేడారం సమ్మక్క జాతర.. అది ఆసియాలోనే పెద్ద జాతర. ఈ జాతరకు భాజపా ఏమి వెలగబెట్టిందో చూపించమనండి. బయ్యారం ఉక్కు పరిశ్రమలో ఆదివాసీ గిరిజన బిడ్డలకు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుంది. ఇక్కడేమి వెలగబెట్టారో చెప్పండి.