లోక్‌సభ, రాజ్యసభలో రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ప్రస్తావించినట్లు తెరాస ఎంపీ నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో తెరాస ఎంపీలు భేటీ అయ్యారు. జీఎస్టీ బకాయిలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రమంత్రితో చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్రమంత్రిని కోరినట్లు నామా వెల్లడించారు. కేంద్రం నుంచి ఐజీఎస్టీ కింద రూ. 4, 531కోట్లు, స్థానిక సంస్థలకు రూ. 312 కోట్లు రావాలని తెలిపారు.
ఇక్కడ రాజకీయాలొద్దు.. అభివృద్ధే ముఖ్యం - Mp naama latest updates
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో తెరాస ఎంపీలు భేటీ అయ్యారు. జీఎస్టీ బకాయిలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రమంత్రితో చర్చించారు.
![ఇక్కడ రాజకీయాలొద్దు.. అభివృద్ధే ముఖ్యం తెరాస ఎంపీల మీడియా సమావేశం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5350989-940-5350989-1576147935780.jpg)
తెరాస ఎంపీల మీడియా సమావేశం
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు నిధులు ఇవ్వాలని నీతిఆయోగ్ చెప్పినట్లు పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్రాలు కలిసిమెలిసి పనిచేస్తే మరింత అభివృద్ధి సాధించవచ్చని ఆకాంక్షించారు. రాష్ట్ర అభివృద్ధిలో ఇతర ఎంపీలు కూడా పాలుపంచుకోవాలని సూచించారు. ఇక్కడ రాజకీయాలు చేయవద్దని తెరాసాయేతర ఎంపీల ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
తెరాస ఎంపీల మీడియా సమావేశం
ఇవీ చూడండి: కోట వైభవం భళా... సౌకర్యాలకై విలవిల