తెలంగాణ

telangana

ETV Bharat / state

TRS MPS: నిబంధనల ప్రకారమే తెలంగాణ అప్పులు: తెరాస ఎంపీలు - తెరాస ఎంపీలు

TRS MPS: శ్రీలంక పరిస్థితిపై జరిగిన అఖిలపక్ష భేటీలో తెరాస ఎంపీలు కేంద్రం తీరుపై మండిపడ్డారు. తెలంగాణ అప్పులపై చర్చ జరుగుతుండగా ఎంపీలు అడ్డుకున్నారు. నిబంధనల ప్రకారమే తెలంగాణ అప్పులు ఉన్నాయన్న తెరాస ఎంపీలు తెలిపారు. కేంద్ర అధికారుల వాదనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు ఏపీ ఎంపీలు సైతం కేంద్రం తీరును తప్పుబట్టారు.

TRS MPS
http://10.10.50.85:6060///finalout4/telangana-nle/finalout/19-July-2022/15869679_54.jpg

By

Published : Jul 19, 2022, 10:41 PM IST

TRS MPS: దేశంలో 10 రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయని కేంద్ర ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. వారి వాదనలపై పలువురు ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణలోనూ అప్పులు మితిమీరాయని కేంద్ర అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ అప్పులపై భేటీలో చర్చకు వచ్చింది. తెలంగాణ అప్పుల ప్రస్తావన రాగానే తెరాస ఎంపీలు అడ్డుకున్నారు. నిబంధనల ప్రకారమే తెలంగాణ అప్పులు ఉన్నాయని ఎంపీలు స్పష్టం చేశారు. శ్రీలంక పరిస్థితి చెప్తూ రాష్ట్రాలను ఎందుకు ప్రస్తావిస్తున్నారంటూ తెరాస ఎంపీలు మండిపడ్డారు.ఇదే అంశంపై ఏపీకి చెందిన వైకాపా ఎంపీలు స్పందించారు. రాష్ట్రాల సంగతి కాదు.. దేశం అప్పుల గురించి చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఎంత అప్పు చేసిందో ముందు చెప్పాలని వైకాపా ఎంపీలు నిలదీశారు.

పొరుగు దేశం శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న నేపథ్యంలో భారత్‌లోనూ అలాంటి పరిస్థితులు నెలకొంటాయనే విషయంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపైనా కేంద్ర మంత్రి సమీక్షించారు.

ABOUT THE AUTHOR

...view details