తెలంగాణ

telangana

ETV Bharat / state

TRS MP's: రాష్ట్రపతి ప్రసంగానికి తెరాస ఎంపీలు దూరం! - Trs Mps in Budget sessions

TRS MP's: రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో రేపు రాష్ట్రపతి ప్రసంగానికి తెరాస ఎంపీలు దూరంగా ఉండాలని తెరాస నిర్ణయించింది.

TRS
TRS

By

Published : Jan 30, 2022, 9:35 PM IST

TRS MP's: రేపు రాష్ట్రపతి ప్రసంగానికి తెరాస ఎంపీలు దూరంగా ఉండాలని పార్టీ నిర్ణయించింది. రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేదన్న సీఎం కేసీఆర్‌ నిర్ణయానికి అనుగూణంగా ఎంపీలు నడుచుకోనున్నారు. నిరసనగా రాష్ట్రపతి ప్రసంగానికి దూరంగా ఉండాలని నిర్ణయించారు. రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.

తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం...

TRS Parliamentary Party Meeting : రాష్ట్ర హక్కులు, ప్రయోజనాలపై పార్లమెంట్‌లో బలమైన వాణి వినిపించాలని... తెరాస ఎంపీలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో సీఎం చర్చించారు. కేంద్రం నుంచి సాధించాల్సిన పెండింగ్‌ అంశాలపై చర్చించి..... కేంద్రంపై అనుసరించాల్సిన పోరాట పంథాపై ఎంపీలకు నిర్దేశం చేశారు.

రాష్ట్రానికి కేంద్రం చేసిందేమీ లేదన్న ముఖ్యమంత్రి..... రాష్ట్రానికి చట్టపరంగా, న్యాయంగా దక్కాల్సినవి కూడా ఇవ్వడం లేదని సీఎం ఆరోపించారు. పార్లమెంట్‌లో గట్టిగా పోరాడేందుకు 23 అంశాలతో కూడిన బుక్‌లెట్‌ను ఎంపీలకు అందించారు. బడ్జెట్‌లో ఏముందో చూసి అందుకు అనుగుణంగా స్పందిస్తామని ఎంపీలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details