పసుపు బోర్టు తీసుకొస్తానని బాండ్ రాసిచ్చిన ఎంపీ ధర్మపురి అర్వింద్ ... పూర్తిగా విఫలమయ్యారని తెరాస ఎంపీలు విమర్శించారు. డివిజన్ కార్యాలయాన్ని రీజినల్ కార్యాలయంగా మాత్రమే మార్చారని తెరాస రాజ్యసభ సభ్యులు బండ ప్రకాశ్ ఆరోపించారు. భాజపా నేతలు పసుపు పంటకు కనీస మద్దతు ధర తీసుకురావాలని పేర్కొన్నారు.
ఎంపీ అర్వింద్‌కు తెరాస ఎంపీల సవాల్
పసుపు బోర్టు తీసుకొస్తానని బాండ్ రాసిచ్చిన ఎంపీ ధర్మపురి అర్వింద్ పూర్తిగా విఫలమయ్యారని తెరాస ఎంపీలు విమర్శించారు. పసుపు రైతుల కోసం కేంద్రం నుంచి 100 కోట్ల నిధులను విడుదల చేయించాలని సవాల్ విసిరారు.
ఎంపీ అర్వింద్‌కు తెరాస ఎంపీలు సవాల్
ప్రజా సంక్షేమ పథకాలు ఆపాలని భాజపా ఎంపీలు, ఫార్మాసిటీ ఆపాలని కాంగ్రెస్ ఎంపీలు చూస్తున్నారని మరో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ చెప్పారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రతిపక్షాలు చూడటం బాధాకరమని అన్నారు. పసుపు రైతుల కోసం కేంద్రం నుంచి రూ.100 కోట్ల నిధులు విడుదల చేయించాలని సవాల్ విసిరారు.