భాజపా నేతలు అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారని... లెక్కింపు ఎందుకు ఆలస్యం అవుతోందని తాము కూడా అడుగుతున్నామని ఎంపీ రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. పరిశీలకుల సమక్షంలోనే అధికారులు ఫలితాలను ప్రకటిస్తున్నారని.. చౌటుప్పల్‌లో అనుకున్న మెజార్టీ రాలేదని రాజగోపాల్ రెడ్డి స్వయంగా చెప్పారన్నారు. భాజపా నేతలు డబ్బులు, మద్యం పంచినప్పటికీ ప్రజలు తగిన తీర్పు ఇచ్చారని వెల్లడించారు. దుబ్బాక, హుజూరాబాద్‌లో ఓటమి పాలైనప్పటికీ... తాము ప్రజాతీర్పును అంగీకరిస్తామని తెలిపారు.
'ప్రజాతీర్పు సరైనదే.. మునుగోడు వాసులకు హ్యాట్సాప్' - మునుగోడు ఉపఎన్నిక ఫలితాలు లైవ్ అప్‌డేట్స్
మునుగోడు ఉపఎన్నిక లెక్కింపు అలస్యంపై భాజపా నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని తెరాస నేతలు ఆరోపించారు. మునుగోడు ప్రజలు సరైన తీర్పునిచ్చారని పేర్కొన్నారు. వారికి హ్యాట్సాప్ అంటూ కితాబునిచ్చారు.
'ప్రజాతీర్పు సరైనదే.. మునుగోడు వాసులకు హ్యాట్సాప్'
93 శాతానికి పైగా ఓటింగ్‌లో పాల్గొన్న మునుగోడు ప్రజలకు హ్యాట్సాప్ అని అన్నారు. కేసీఆర్‌పై విశ్వాసంతో ప్రజల అభ్యున్నతి కోసం, అద్భుత పరిపాలనకు మునుగోడు ప్రజలు మరోమారు పట్టం కడుతున్నారన్నారు. తెరాస గెలుపు నల్లేరుపై నడకగా కనిపిస్తోందని తెరాస నేత దాసోజు శ్రావణ్ అన్నారు.
ఇవీ చూడండి: