తెలంగాణ

telangana

ETV Bharat / state

బాలసుబ్రహ్మణ్యుడి గానం.. అమరం: ఎంపీ నామ నాగేశ్వరరావు - versatile singer sp balasubrahmanyam died

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. 16 భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడిన సంగీత దిగ్గజుడని కొనియాడారు.

versatile singer sp balasubrahmanyam
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణంపై నామ స్పందన

By

Published : Sep 25, 2020, 4:21 PM IST

గాన గంధర్వుడు, విఖ్యాత గాయకుడు.. పద్మభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపట్ల తెరాస లోక్​సభ పక్షనేత నామ నాగేశ్వరరావు విచారం వ్యక్తం చేశారు. బాలు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

16 భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడి, అనేక జాతీయ, ఫిల్మ్​ఫేర్ పురస్కారాలు అందుకున్న గొప్ప గాయకుడని కొనియాడారు. కేవలం గాయకుడిగానే గాక.. నటుడు, నిర్మాత, సంగీత దర్శకుడిగా సేవలందించారని గుర్తుచేసుకున్నారు.

ఇదీ చూడండి :గుండెలకు హత్తుకునే తమ్ముడ్ని కోల్పోయాను: రామోజీరావు

ABOUT THE AUTHOR

...view details