తెరాస లోక్‌సభాపక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు(Nama) నేడు ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరు కానున్నారు. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఇటీవల నామాకు దర్యాప్తు అధికారులు సమన్లు జారీ చేశారు. ఝార్ఖండ్‌లో జాతీయ రహదారి కోసం ఏర్పాటు చేసిన రాంచీ ఎక్స్ ప్రైస్ హైవే ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వివిధ బ్యాంకుల నుంచి సుమారు వెయ్యి కోట్ల రూపాయల రుణాలు తీసుకొని ఇతర వ్యాపారాలకు మళ్లించినట్లు మధుకాన్ డైరెక్టర్లపై అభియోగం.
Nama: ఈడీ విచారణకు హాజరు కానున్న ఎంపీ నామ నాగేశ్వరరావు - ఎంపీ నామ నాగేశ్వరరావు తాజా వార్తలు
రాంచీ ఎక్స్ ప్రైస్ హైవే ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని వ్యాపారాలకు మళ్లించినట్లు అభియోగంపై తెరాస లోక్‌సభాపక్షనేత నామా నాగేశ్వరరావు(Nama), నేడు ఈడీ అధికారులు విచారించనున్నారు. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఇటీవల నామాకు దర్యాప్తు అధికారులు సమన్లు జారీ చేశారు.
ఎంపీ, నామ నాగేశ్వరరావు
సీబీఐ కేసు ఆధారంగా విచారణ చేపట్టిన ఈడీ... ఇటీవల నామా నాగేశ్వరరావుతో పాటు మధుకాన్ డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. సోదాల్లో భారీగా నగదు, దస్త్రాలు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్న ఈడీ... వాటిని విశ్లేషించింది. మరింత సమాచారం కోసం నామా నాగేశ్వరరావుతో పాటు మధుకాన్ డైరెక్టర్లను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.